ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు వారికి మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) ఒక సరికొత్త వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లకు బస్టాండ్‌కు వెళ్లే తిప్పలు తప్పిస్తూ, నేరుగా వారి ఇంటి వద్ద నుంచే ఆర్టీసీ బస్సు ఎక్కే వెసులుబాటును కల్పించబోతోంది.

సాధారణంగా సూపర్ లగ్జరీ, ఏసీ, స్లీపర్ వంటి అగ్రశ్రేణి (హైయ్యండ్) బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, నిర్ణీత సమయానికంటే ముందే లగేజీతో బస్టాండ్‌కు చేరుకోవడం ప్రయాణికులకు పెద్ద శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా కుటుంబాలు, బంధువులు లేదా స్నేహితుల బృందాలు ప్రయాణిస్తున్నప్పుడు లగేజీతో సమయానికి బస్టాండ్‌కు రావడం తీవ్ర ఇబ్బందిగా మారుతోంది.
ఈ సమస్యను గుర్తించిన ఆర్టీసీ అధికారులు బల్క్ బుకింగ్ విధానానికి ప్రాధాన్యతనిచ్చారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేసారి బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే, ఆర్టీసీ బస్సే స్వయంగా వారి ఇంటి వద్దకు వచ్చి ప్రయాణికులను పికప్ చేసుకునేలా సరికొత్త వెసులుబాటును అందుబాటులోకి తెస్తున్నారు.
ఈ వినూత్న పికప్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ముందుగా విజయవాడ నగర పరిధిలో అమలు చేయాలని విజయవాడ రీజియన్ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. విజయవాడలో సాధించే ప్రగతి, ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాలని ఆర్టీసీ భావిస్తోంది.
హైయ్యండ్కు చెందిన సూపర్ లగ్జరీ, ఏసీ గరుడ, నైట్ రైడర్, స్లీపర్ బస్సులలో ప్రయాణించే వారు 10 అంతకంటే ఎక్కువ టికెట్లను బల్క్ బుకింగ్ చేసుకున్న తర్వాత, ఆ సమాచారాన్ని ముందస్తుగా ఆర్టీసీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త డిజిటల్ లేదా కాల్ ఆధారిత వ్యవస్థను రూపుదిద్దుతున్నారు. ఈ కసరత్తు పూర్తయిన వెంటనే పూర్తి విధివిధానాలు, నిబంధనలను ఆర్టీసీ అధికారికంగా వెల్లడించనుంది.
{{/usCountry}}హైయ్యండ్కు చెందిన సూపర్ లగ్జరీ, ఏసీ గరుడ, నైట్ రైడర్, స్లీపర్ బస్సులలో ప్రయాణించే వారు 10 అంతకంటే ఎక్కువ టికెట్లను బల్క్ బుకింగ్ చేసుకున్న తర్వాత, ఆ సమాచారాన్ని ముందస్తుగా ఆర్టీసీ అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దీనికోసం ప్రత్యేకంగా ఒక కొత్త డిజిటల్ లేదా కాల్ ఆధారిత వ్యవస్థను రూపుదిద్దుతున్నారు. ఈ కసరత్తు పూర్తయిన వెంటనే పూర్తి విధివిధానాలు, నిబంధనలను ఆర్టీసీ అధికారికంగా వెల్లడించనుంది.
{{/usCountry}}ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దూరప్రాంత ప్రయాణికులు, కుటుంబ సమేతంగా ప్రయాణించే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆటోలు, టాక్సీల ఛార్జీల భారం తగ్గడమే కాకుండా సకాలంలో ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఈ సేవలు ఎంతో దోహదపడనున్నాయి.