మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు.. ఈ డిపోల నుంచి!

మహాశివరాత్రికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు వేస్తోంది. కొన్ని డిపోల నుంచే ఇప్పటికే చాలా బస్సు సర్వీసులను ప్రకటించింది.

Published on: Feb 2, 2026, 12:56:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహాశివరాత్రి దగ్గరకు వస్తోంది. దీంతో శైవక్షేత్రాలకు పెద్ద ఎత్తున ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో గుంటూరు 1, 2 డిపోలతోపాటుగా పొన్నూరు, తెనాలి, మంగళగిరి డిపోల నుంచి కోటప్పకొండకు వంద ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో కోటప్పకొండకు వెళ్తాయి. ఫిబ్రవరి 16వ తేదీన డిపోలకు చేరుకుంటాయి. క్వారీ, గోవాడ, అమరావతి, శ్రీశైలం క్షేత్రాలకు కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతామని అధికారులు చెప్పారు.

ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

గుంటూరు-2, తెనాలి డిపోల నుంచి క్వారీ ప్రాంతానికి 50 బస్సులు నడుస్తాయి. పొన్నూరు, తెనాలి డిపోల నుంచి 45 బస్సులు గోవాడకు నడపనున్నారు ఆర్టీసీ అధికారులు. అమరావతికి గుంటూరు 1 డిపో నుంచి 25 బస్సులు, శ్రీశైలానికి 5 డిపోల నుంచి 30 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుస్తాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి ఆర్టీసీ కోరుతోంది. ఈ ప్రత్యేక బస్సుల్లో స్త్రీ శక్తి ఫథకం వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ అవసరం అయితే మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనున్నారు.

తనకోనకు ప్రత్యేక బస్సు సర్వీస్

మహాశివరాత్రి సందర్భంగా తలకోన, కాణిపాకానికి పీలేరు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసు నడుపుతోంది ఆర్టీసీ అధికారులు. ఇప్పటికే తలకోనలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. ప్రతీరోజూ ఉదయం పీలేరు నుంచి తలకోన, అక్కడి నుంచి కాణిపాకం, కాణిపాకం నుంచి పీలేరుకు బస్సు సర్వీసు నడపనున్నారు.

రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల నుంచి శ్రీశైలంతోపాటుగా ఇతర ప్రాంతాలకు అధికారులు బస్సు సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రత్యేక బస్సులు శివరాత్రి సందర్భంగా నడుస్తాయి. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీశైలంలో ఏర్పాట్లు

మహా శివరాత్రి పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో శ్రీశైలం క్షేత్రానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ఆలయంలో సన్నాహాలు ముమ్మరం చేశారు. మూడు రోజుల పండుగ సమయంలో సుమారు ఏడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి ఉంది.

భక్తుల సంఖ్య పెరిగే నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ శాఖల సంయుక్త పర్యవేక్షణలో విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రధాన శివరాత్రి గమ్యస్థానాలలో ఒకటిగా శ్రీశైలం ఉంది. పండుగ సమయంలో శ్రీశైలంలో భారీగా జనసందోహం చూసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘాట్ రోడ్‌లో లోడుతో వచ్చే వాహనాలకు భారీగా జరిమానా విధించనున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More