శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు.. 20 అదనపు లడ్డూ కౌంటర్లు!
మహా శివరాత్రి కోసం శ్రీశైలం మల్లన్న దేవస్థానం రెడీ అవుతోంది. ఏర్పాట్లపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఫిబ్రవరి 8 నుండి 18 వరకు జరగనున్న 11 రోజుల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయ దేవస్థానం విస్తృతమైన సన్నాహాలు ప్రారంభించింది. మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. శాఖల వారీగా ఏర్పాట్లను చర్చించామని, నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని దేవస్థానం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం, ధర్మకర్తల మండలి మద్దతుతో సన్నాహాలు జరుగుతున్నాయని ఈవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

పండుగకు ముందే భక్తులు వస్తారని అంచనా వేస్తున్నందున, పనులను వేగవంతం చేసి సరిగా భక్తులక సౌకర్యాలు అందించాలని ఆయా శాఖలను ఈవో ఆదేశించారు. గత సంవత్సరం కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ సాధ్యమైన చోట 20-30 శాతం అదనపు సౌకర్యాలను కల్పించాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.
నల్లమల అడవుల్లోని నాగలూటి, పెద్ద చెరువు, భీముని కొలను, కైలాస ద్వారం, సాక్షి గణపతి వద్ద కాలినడక భక్తుల సౌకర్యాలపై ఇంజనీరింగ్, అటవీ శాఖల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
బహిరంగ ప్రదేశాలలో పైప్ పండళ్లు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేస్తారు. క్యూ లైన్ల నిర్వహణ, టాయిలెట్లను మరమ్మతు చేయడం, పాతాళగంగ స్నానపు ప్రదేశాలలో భద్రతా చర్యలు మెరుగుపరచడం, మెట్ల మరమ్మతులు చేయడం వంటివి చేస్తున్నారు అధికారులు.
అదనపు పార్కింగ్ ప్రాంతాలు, స్పష్టమైన సూచిక బోర్డులు, లగేజీ రూమ్‌లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భక్తుల సౌలభ్యం కోసం 20 అదనపు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో మొత్తం 30కి చేరుకుంటాయి. స్వచ్ఛంద సంస్థల మద్దతుతో అన్న ప్రసాద పంపిణీని పెంచుతారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


