డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా.. బస్సులో 87 మంది!

విజయనగరం జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో మెుత్తం 87 మంది ఉన్నారు.

Published on: Jan 19, 2026, 13:05:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విజయనగరం జిల్లాలో గరివిడి మండలం అప్పన్నవలస దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో మెుత్తం 87 మంది ఉన్నారు. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాజాం మీదుగా చీపురుపల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సు గరివిడి మండలం అప్పన్నవలస దగ్గర బస్సు బోల్తా పడింది. డ్రైవర్‌కి ఫిట్స్ రావడంతో ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి వెళ్లి బోల్తా పడింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

డ్రైవర్‌కు ఫిట్స్ రావడం కారణంగానే.. బస్సు అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్లింది, బోల్తా పడింది. ఇందులో ఏడుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా కొందరికి స్వల్వగాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగే సమయంలో మెుత్తం 87 మంది బస్సులో ఉన్నారు. డ్రైవర్ అప్పల గురువులును ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు

మరోవైపు సంక్రాంతి సెలవులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో పలు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారులో సోమవారం ఉదయం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో పిఠాపురం ఆసుపత్రికి తరలించారు.

కాకినాడ జిల్లాలోనే జగ్గంపేట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఈ కారణంగా ప్రయాణికులు భయంతో బస్సు దిగి పరుగులు తీశారు. బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై సమస్యను గుర్తించి.. సరి చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు హైదరాబాద్‌ వైపు వస్తుంది. ఇంజిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే పొగలు వ్యాపించాయి. ఈ సమయంలో బస్సులో 30 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.

నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More