సంక్రాంతి రద్దీ కారణంగా వైజాగ్ నుండి ఏపీఎస్ఆర్టీసీ 1,500 అదనపు బస్సు సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగ కోసం విస్తృతమైన ఏర్పాట్లను చేపట్టింది. పండుగ సీజన్‌లో ప్రయాణాన్ని సజావుగా సాగేలా విశాఖపట్నం నుండి 1,500 అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగ కోసం విస్తృతమైన ఏర్పాట్లను చేపట్టింది. పండుగ సీజన్‌లో ప్రయాణాన్ని సజావుగా సాగేలా విశాఖపట్నం నుండి 1,500 అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ప్రకటించింది.

పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ప్రతి సంవత్సరం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని, ఈ సంవత్సరం కూడా నడుపుతున్నట్టుగా ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పల నాయుడు తెలిపారు. విశాఖపట్నం నుండి విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలతో సహా ప్రధాన గమ్యస్థానాలకు 1,500 అదనపు బస్సు సర్వీసులను నడపడానికి ప్రణాళికలు వేశారు.
సంక్రాంతి వేడుకలకు ఇంటికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది. విశాఖపట్నం నగరంలో డిపో మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి, రియల్ టైమ్ డిమాండ్ ప్రకారం బస్సులు నడపాలని నిర్ణయించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళా ప్రయాణికులకు ఉన్న బస్సులలో ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు. పండుగ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ చూసుకుంటోంది.
పండుగకు ముందు ప్రయాణికుల డిమాండ్ తీర్చడానికి ఏపీఎస్ఆర్టీసీ తన సాధారణ సేవలతో పాటు 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఏ రూట్‌లోనూ అదనపు లేదా పండుగ కారణంగా అదనపు ఛార్జీలు లేకుండా.. సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని ఆర్టీసీ స్పష్టం చేసింది.
సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 12 నుంచే ప్రారంభమైన ఈ ప్రత్యేక సర్వీసులు.. కనుమ పండుగ తర్వాత కూడా నాలుగైదు రోజులు సర్వీసులు కొనసాగుతాయి.
పండుగ రద్దీ దృష్ట్యా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో కూడా ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి తెలిపారు. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా సొంత ఊళ్లకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇది పండుగ కానుకగా అని అన్నారు.
అదే విధంగా ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పండుగను ప్రజలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


