...
...
Next Story

ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులే బస్సులు.. రిటర్న్ జర్నీ కూడా నో ప్రాబ్లమ్!

ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. పలు బస్సులను ప్రత్యేకంగా నడపనుంది. రిటర్న్ జర్నీ కూడా సమస్య లేకుండా చూసేందుకు ప్లాన్ చేసింది.

Published on: Jan 07, 2026 04:18 PM IST
Advertisement

సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. హైదరాబాద్ లాంటి నగరాల నుంచి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాయి. మహిళల కోసం స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ పథకం కింద పెద్ద సంఖ్యలో బస్సులను కేటాయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ప్రణాళికలను సవరించింది.

ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

ఏపీఎస్‌ఆర్టీసీ కార్యనిర్వాహక సంచాలకులు(ఆపరేషన్స్) ఎ. అప్పల రాజు ఒక ప్రకటనలో మాట్లాడారు. ఈ సంవత్సరం జిల్లా కేంద్రాలు, మండలం, పట్టణాలు, గ్రామాలకు ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ తన సంక్రాంతి 2026 వ్యూహంలో భాగంగా రాష్ట్రంలోని సర్వీసులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిందని అన్నారు.

పండుగ సమయంలో సంస్థ మొత్తం 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. వీటిలో అధిక శాతం సర్వీసులు రాష్ట్ర అంతర్గత మార్గాలకే పరిమితమవుతాయి. వీటిలో 71 శాతానికి సమానమైన 6,000 బస్సులు ఆంధ్రప్రదేశ్‌లోపలే నడుస్తాయి. మిగిలిన 2,432 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి అంతర్రాష్ట్ర మార్గాల్లో నడిపిస్తారు.

పండుగకు ముందు 3,857 ప్రత్యేక సర్వీసులను నడుపనుంది ఏపీఎస్ఆర్టీసీ. వీటిలో 3,500 బస్సులు రాష్ట్ర అంతర్గత మార్గాల్లో నడుస్తాయి. 240 సర్వీసులు హైదరాబాద్‌కు, 102 బెంగళూరుకు, 15 చెన్నైకి నడుస్తాయి. సాధారణంగా నడిచేవాటికి ఇవి అదనం.

సంక్రాంతి తర్వాత ఏపీఎస్‌ఆర్టీసీ 4,575 ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. వీటిలో 2,500 బస్సులు రాష్ట్రంలోపలే నడుస్తాయి. 1,800 సర్వీసులు హైదరాబాద్‌కు, 200 బెంగళూరుకు, 75 చెన్నైకి నడుస్తాయి. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నారు. దూర ప్రాంతాల వారు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe