ఏపీఎస్ఆర్టీసీ టెంపుల్ టూరిజం ప్యాకేజీలు.. కర్ణాటక-మైసూరు, కాశీ-అయోధ్య

ఏపీఎస్ఆర్టీసీ పలు టూరిజం ప్యాకేజీలు నడుపుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక-మైసూరు, కాశీ-అయోధ్య ప్యాకేజీలు ఉన్నాయి.

Published on: Dec 25, 2025, 11:14:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల అనేక పర్యాటక ప్యాకేజీలను రన్ చేస్తోంది. శబరిమల, అరుణాచలంలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. టెంపుల్ టూరిజంలో భాగంగా అనే ప్యాకేజీలను నడుపుతోంది. కొత్త రూట్లలోనూ పర్యాటకులను తీసుకెళ్తోంది. భక్తులను ఆధ్యాత్మికత అనుభూతిని కలిగిస్తుంది. తాజాగా కర్ణాటక-మైసూరు, కాశీ-అయోధ్య పేరుతో టూర్ ప్యాకేజీలను తెచ్చింది ఆర్టీసీ. ఆ వివరాలు చూద్దాం..

అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహం
అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహం

ఈ రెండు ప్యాకేజీలు మరికొన్ని రోజుల్లో మెుదలుకానున్నాయి. జనవరి 20వ తేదీన కర్ణాటక-మైసూరు, ఫిబ్రవరి 7న కాశీ-అయోధ్య యాత్రకు వెళ్లవచ్చు. ఈ బస్సులు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరుతాయి. సాయంత్రం 4 గంటలకు ప్రయాణం మెుదలుకానుంది. ఇందుకోసం సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను ఉపయోగిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. బస చేసేందుకు గదులు తీసుకుంటే.. దానికి డబ్బులను పర్యాటకులే చూసుకోవాలి.

కర్ణాటక-మైసూరు యాత్ర.. తొమ్మిది రోజులు ఉంటుంది. ఇందులో శ్రీశైలం, రాజమండ్రి, మహానంది, మంత్రాలయం దర్శనాలు ఉంటాయి. ఆ తర్వాత అక్కడి నుండి కర్ణాటకలోకి వెళ్తారు. హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, శ్రీరంగపట్నం, మైసూర్‌కు వెళ్తారు. ఈ యాత్రలో ఒక్కరికి రూ.11,500 ఛార్జీలు ఉంటాయి. భోజన సదుపాయంతో కలిపి ఈ ప్యాకేజీ అన్నమాట. అదనపు ఖర్చులను భక్తులే భరించాలి.

కాశీ-అయోధ్య యాత్ర 11 రోజులు ఉంటుంది. 13 పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఒడిశాలో మెుదటగా పూరి జనార్ధనుడి ఆలయం దర్శించుకుంటారు. తర్వాత కోణార్క్‌లోని సూర్యదేవాలయం, జాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం, కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, గయ, బుద్ధగయను సందర్శించుకోవచ్చు. తర్వాత తిరిగి వస్తారు.

మహా శివరాత్రికి కాశీని దర్శించుకునేలా ఈ ప్లాన్ ఉంది. తిరిగి వచ్చే సమయంలో శ్రీకాకుళం అరసవల్లి, శ్రీకుర్మం, అన్నవరం క్షేత్రాలను సందర్శించి రావొచ్చు. రూ.13000 ప్యాకేజీ ధరగా నిర్ణయించారు. ఇందులో కూడా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారాన్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిప్‌కు సంబంధించి రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోను సంప్రదించవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More