నైపుణ్యం కలిగిన నర్సులకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ కెరీర్ అవకాశాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్ వసుధ ఫలితాలను ఇస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద తొలి విడతలో ఎంపికైన ముగ్గురు నర్సులు జర్మనీలో భాషా శిక్షణ, ఉద్యోగ అవకాశాల కోసం విమానమెక్కారు.

కాకినాడలోని ఆదిత్య నర్సింగ్ కళాశాలకు చెందిన నమిత, సనాయా సింగ్, శ్రీమాధురి కొర్ర అనే ముగ్గురు విద్యార్థినులు ఈ పథకం కింద మొదటి బ్యాచ్‌గా ఎంపికయ్యారు. జర్మనీ వెళ్లేముందు వీరికి రాజమహేంద్రవరంలో జర్మన్ భాషపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. విదేశాలలో స్థ స్థానిక వాతావరణానికి, పని సంస్కృతికి అలవాటు పడేలా APSSDC ఈ శిక్షణా కార్యక్రమాలను రూపొందించింది.
జర్మనీ చేరుకున్న తర్వాత ఈ నర్సులు ఆరు నెలల పాటు B2-లెవల్ జర్మన్ భాషా శిక్షణ పొందుతారు. అలాగే అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన ప్రొఫెషనల్ రికగ్నిషన్ ప్రాసెస్‌ను పూర్తి చేస్తారు. ఈ ఆరు నెలల శిక్షణా సమయంలో ప్రతి నెలా ఉచిత వసతి, ఆహారంతో పాటు సుమారు రూ. 1.20 లక్షలు స్టైపెండ్‌గా అందుకుంటారు.
భాషా శిక్షణ, గుర్తింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వెంటనే నర్సులు ఉద్యోగంలో చేరతారు. అప్పుడు వారికి నెలకు సుమారు రూ. 3.40 లక్షలు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది.
ఈ సందర్భంగా APSSDC మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ జి. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్ జర్మనీ వెళ్లడం అనేది ఏపీలోని నైపుణ్యం కలిగిన నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలను సృష్టించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని కొనియాడారు.
ఈ కార్యక్రమాన్ని ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (OMCAP), స్కిల్ బీ ప్రైవేట్ లిమిటెడ్ (Skill Bee Pvt. Ltd.) భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, OMCAP జనరల్ మేనేజర్ డి. మనోహర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ జర్మన్ భాషా శిక్షణ, వృత్తిపరమైన గుర్తింపు, విదేశీ ఉద్యోగ మద్దతును కవర్ చేసే ఒక నిర్మాణాత్మకమైన మార్గాన్ని నర్సులకు అందిస్తుందని తెలిపారు.
{{/usCountry}}ఈ కార్యక్రమాన్ని ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (OMCAP), స్కిల్ బీ ప్రైవేట్ లిమిటెడ్ (Skill Bee Pvt. Ltd.) భాగస్వామ్యంతో అమలు చేస్తున్నారు. APSSDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, OMCAP జనరల్ మేనేజర్ డి. మనోహర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ జర్మన్ భాషా శిక్షణ, వృత్తిపరమైన గుర్తింపు, విదేశీ ఉద్యోగ మద్దతును కవర్ చేసే ఒక నిర్మాణాత్మకమైన మార్గాన్ని నర్సులకు అందిస్తుందని తెలిపారు.
{{/usCountry}}ప్రస్తుతం జర్మనీ దేశంలో ఆరోగ్య సంరక్షణ విభాగంలో నర్సింగ్ సిబ్బందికి భారీగా కొరత ఉంది. భారతీయ నర్సులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉపాధి పొందడానికి ఇది ఒక సువర్ణావకాశం. ప్రాజెక్ట్ వసుధ ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాచ్‌ల ద్వారా వందలాది మంది నర్సులను విదేశాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే ఏపీ నర్సింగ్ అభ్యర్థులకు ఈ పథకం ఒక వరంగా మారనుంది.