...
...
Next Story

AIBE XXI Results 2026 : ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ 21 ఫలితాలు విడుదల - మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

AIBE XXI Results : ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE 21) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు www.allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు

Published on: Jul 19, 2026, 05:05:47 IST
Advertisement

AIBE XXI Results : దేశవ్యాప్తంగా న్యాయవాద వృత్తిని చేపట్టాలనుకునే వారు రాసే 'ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్' (AIBE-XX) ఫలితాలు వెలువడ్డాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) శనివారం రాత్రి ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ allindiabarexamination.com లో చూడవచ్చు.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE 21) ఫలితాలు
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE 21) ఫలితాలు

జూన్ 7, 2026న దేశవ్యాప్తంగా 60 నగరాల్లోని 292 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,75,701 మంది అభ్యర్థులు హాజరుకాగా.. అందులో 1,10,909 మంది పురుషులు, 64,784 మంది మహిళలు మరియు 8 మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు ఉన్నారు.

ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహించారు. ప్రాథమిక నిబంధనల ప్రకారం క్వాలిఫైయింగ్ కటాఫ్ మార్కులను జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 45 మార్కులుగా, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల (PwD) కేటగిరీ అభ్యర్థులకు 40 మార్కులుగా నిర్ణయించారు. అయితే…. పరీక్ష ముగిసిన అనంతరం ప్రశ్నపత్రం సరళిని, ఫలితాల సమ్మరీని పరిశీలించిన బీసీఐ మానిటరింగ్ కమిటీ అభ్యర్థుల ప్రయోజనార్థం క్వాలిఫైయింగ్ స్కోరును ఏకగ్రీవంగా 3 మార్కులు తగ్గించాలని నిర్ణయించింది.

ఫలితాల వివరాలు…

కటాఫ్ మార్కులు తగ్గించడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలో క్వాలిఫై అయ్యారు. పరీక్షకు హాజరైన 64,784 మంది మహిళల్లో 42,757 మంది ఉత్తీర్ణత సాధించగా, 1,10,909 మంది పురుషులలో 73,045 మంది క్వాలిఫై అయ్యారు. అలాగే 8 మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల్లో ముగ్గురు పరీక్షలో పాస్ అయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ నుంచి అత్యధికంగా 13,610 మంది పురుషులు, 3,178 మంది మహిళా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.

AIBE XXI ఫలితాలు - ఎలా చెక్ చేసుకోవాలంటే..?

  • అభ్యర్థులు ముందుగా https://www.allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని లాగిన్ ఆప్షన్ పై నొక్కాలి.
  • మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.

AIBE-XXII (22వ) పరీక్ష షెడ్యూల్ విడుదల

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks