తిరుమల శ్రీవారికి భారీ కానుక - 7 బంగారు పతకాలు విరాళం ఇచ్చిన లేడీ డాక్టర్

Tirumala Srivari Donation : తిరుమల శ్రీవారికి బెంగళూరుకు చెందిన భక్తురాలు డాక్టర్ ఎం మహాదేవమ్మ 753 గ్రాముల బరువున్న ఏడు బంగారు పతకాలను కానుకగా అందజేశారు. ఈ బంగారు పతకాల విలువ దాదాపు రూ.94.80 లక్షలు ఉంటుంది.

Published on: Apr 24, 2026, 14:55:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tirumala Srivari Donation : కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ భారీ విరాళాలు సమర్పిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి మరో భక్తురాలు భక్తితో ఖరీదైన కానుకను అందజేశారు.బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎం మహాదేవమ్మ 753 గ్రాముల బరువున్న ఏడు బంగారు పతకాలను తిరుమల శ్రీవారికి కానుకగా అందజేశారు.

శ్రీవారికి బంగారు పతకాలు విరాళం
శ్రీవారికి బంగారు పతకాలు విరాళం

7 బంగారు పతకాలు…

సుమారు 753 గ్రాముల బరువున్న 7 బంగారు పతకాలను ఆమె… తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.94.80 లక్షలు ఉంటుందని అంచనా.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో దాత డాక్టర్ ఎం మహాదేవమ్మ…. ఈ బంగారు పతకాలను టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలు ఈ విరాళాన్ని స్వీకరించారు. స్వామివారి పట్ల తనకున్న అపారమైన భక్తితో ఈ కానుకను సమర్పించినట్లు దాత ఈ సందర్భంగా పేర్కొన్నారు.

విరాళం స్వీకరించిన అనంతరం అధికారులు దాతకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి, వేద ఆశీర్వచనం చేయించారు. తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు,…స్వామివారికి అందుతున్న విరాళాల తాకిడి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ బంగారు పతకాలను స్వామివారి అలంకరణలో లేదా టీటీడీ నిబంధనల మేరకు వినియోగించనున్నారు.

బంగారుపతకాలను సమర్పించే సమయంలో డాక్టర్ మహాదేవమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. తాను సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని తిరిగి ఆ ఏడుకొండల వాడికే అర్పించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా… అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More