TTD : భక్తులకు టీటీడీ విజ్ఞప్తి .. ఆ విషయంలో ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి!

TTD : భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో దర్శనాలు, గదుల పేరుతో భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Published on: Apr 15, 2026 10:18 PM IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శనాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టుగా తెలిపింది.

తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం

దీనిలో భాగంగా టీటీడీ విజిలెన్స్ వారి సహకారంతో, పోలీసుల స‌మ‌న్వయంతో సోషయ‌ల్ మీడియాలో “శ్రావ‌ణ్ క‌ళ తిరుమ‌ల‌, తిరుప‌తి వెంకటేశ్వర స్వామి దేవ‌స్థానం” ఐడీతో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న చిత్తూరుజిల్లా పెనుమూరుకు చెందిన కామ‌సాని ప‌వ‌న్ కుమార్ అలియాస్ నాగ‌రాజు, బోడిరెడ్డి చెన్నకేశ‌వులు అనే వ్యక్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు రిమాండ్‌కు త‌ర‌లించారు.

ఇటీవ‌ల సోషల్ మీడియాలో భ‌క్తుల‌ను మోస‌గిస్తున్న ఉందంతాల దృష్ట్యా భ‌క్తులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ అధికారిక మాధ్యమాల ద్వారానే దర్శనాలు, గదులు బుక్ చేసుకోవాలని భక్తులను కోరుతోంది. ఎవ‌రైనా తిరుమ‌ల‌లో ద‌ర్శనాలు, గ‌దులు తీసి ఇస్తామ‌ని చెబితే న‌మ్మకూడ‌ద‌ని భ‌క్తుల‌ను తెలిపింది. అలాంటి వ్యక్తుల స‌మాచారం తెలిస్తే టీటీడీ విజిలెన్స్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నెంబర్ 9866898630కు ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపింది.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగింపు

మరోవైపు తిరుమలలోని లగేజీ సెంటర్‌లో నరసింహారెడ్డి అనే వ్యక్తి భక్తుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుండి తొలగించడం జరిగింది. టీటీడీ లగేజీ డిపాజిట్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. భక్తులెవ్వరూ తమ లగేజీ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని టీటీడీ తెలియజేస్తోంది.

నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే విజిలెన్స్ కంట్రోల్ నెంబర్ : 9866898630కు ఫిర్యాదు చేయాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు ఇబ్బందులు కలిగించే అంశాలను టీటీడీ ఉపేక్షించడం లేదు. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుంది. భక్తులు కూడా మోసం చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది. ఎలాంటి సేవలైనా టీటీడీ అధికారికంగా, సంబంధిత అధికారుల ద్వారానే చేస్తుంది. మధ్యవర్తులు, సోషల్ మీడియాలో వచ్చేవాటిని నమ్మి భక్తులు మోసపోకూడదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More