Kadapa Crime : ప్రేమోన్మాది చేతిలో విద్యార్థిని దారుణ హత్య - తప్పించుకోబోయిన నిందితుడిపై పోలీసుల కాల్పులు!

కడప జిల్లా ఖాజీపేటలో దారుణం వెలుగు చూసింది. పెళ్లి ప్రపోజల్‌ను నిరాకరించిన విద్యార్థినిని వెంకటేష్ అనే వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా… తప్పించుకునే ప్రయత్నించాడు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు.

Published on: Apr 11, 2026, 16:16:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కడప జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రేమతో పేరుతో ఇంటర్ విద్యార్థిని వేధిస్తున్న ఓ ఉన్మాది రెచ్చిపోయి… అత్యంగా దారుణంగా చంపేశాడు. గొంతుకోసి హత్య చేశాడు. ఖాజీపేటలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.

నిందితుడిపై పోలీసుల కాల్పులు! representative image (image source istock)
నిందితుడిపై పోలీసుల కాల్పులు! representative image (image source istock)

ప్రేమ, పెళ్లి పేరుతో వేధింపులు…

ప్రాథమిక వివరాల ప్రకారం…. నిందితుడు వెంకటేష్ గత కొంతకాలంగా ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చని ఆ యువతి పెళ్లి ప్రతిపాదనను నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న వెంకటేష్…. శుక్రవారం యువతి ఇంటికెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి… యువతిపై దాడి చేసి అత్యంత క్రూరంగా గొంతు కోశాడు.

రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను కుటుంబ సభ్యులు గమనించి… ఆస్పత్రికి తరలించారు. కడప రిమ్స్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కొనఊపిరితో ఉన్న ఆమె.. వెంకటేశ్ తో పాటు మరోవ్యక్తి పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. ఆస్పత్రికి చేరకముందే మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితుడు వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు అయితే నిందితుడు.ఇవాళ తెల్లవారుజామున తప్పించుకునేందుకు ప్రయత్నించాడు.మైదుకూరు నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.పారిపోతున్న నిందితుడిని అడ్డుకునేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. నిందితుడి వెనక్కి తగ్గకపోవటంతో…. అతడి కాళ్లపైకి కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడిని కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

దర్యాప్తు కొనసాగుతోంది - జిల్లా ఎస్పీ విశ్వనాథ్

ఈ ఘటనను కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ధ్రువీకరించారు. లోతైన దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More