ప్రయాణికుల డిమాండ్‌లో నిరంతర పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం, షాలిమార్, చర్లపల్లి వంటి కీలక గమ్యస్థానాలను కలిపే అనేక వేసవి ప్రత్యేక రైళ్ల కార్యకలాపాలను భారతీయ రైల్వే పొడిగించింది. అదనపు ట్రిప్పులు నడుపుతోంది. దీంతో మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది. సమ్మర్ ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.

ట్రైన్ నెంబర్ 02811 భువనేశ్వర్-యశ్వంతపూర్ రైలు జూలై 4 నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు నడవనుంది. మెుత్తం 9 సర్వీసులు నడుస్తాయి. ప్రతీ శనివారం ఉంటుంది.
02812 నెంబర్ ట్రైన్ యశ్వంతపూర్-భువనేశ్వర్ మధ్య ప్రతీ సోమవారం జూలై 6 నుంచి ఆగస్టు 31 మధ్య తొమ్మిది సర్వీసులు నడుపనుంది.
08581 ట్రైన్ విశాఖపట్నం-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య జూలై 3 నుంచి జూలై 31 వరకు ప్రతీ శుక్రవారం నడుస్తాయి. మెుత్తం 5 సర్వీసులు నడపనున్నారు.
ట్రైన్ నెంబర్ 08582 ఎస్ఎంవీటీ బెంగళూరు-విశాఖపట్నం మధ్య ప్రతీ శనివారం నడుస్తుంది. అయితే ఈ సర్వీస్ జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు ఉంటుంది.
08045 ట్రైన్ షాలిమార్-చర్లపల్లి మధ్య ప్రతీ శుక్రవారం జూలై 3 నుంచి జూలై 10 వరకు, మళ్లీ జూలై 17 నుంచి జూలై 31 వరకు 5 సర్వీసులు నడుస్తుంది.
08046 చర్లపల్లి-షాలిమార్ ప్రతీ శనివారం జూలై 4 నుంచి జూలై 11 వరకు, జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు 5 సర్వీసులు నడవనుంది.
చర్లపల్లి-కాకినాడ-చర్లపల్లి
07817 ట్రైన్ నెంబర్ చర్లపల్లి కాకినాడ మధ్య గురువారం జూన్ 25వ తేదీన ఉంది. 07818 కాకినాడ-చర్లపల్లి ట్రైన్ జూన్ 28వ తేదీన ఆదివారం రోజున ఉంది.
ఈ సర్వీస్ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతుంది.
చర్లపల్లి-తిరుపతి
{{/usCountry}}ఈ సర్వీస్ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతుంది.
చర్లపల్లి-తిరుపతి
{{/usCountry}}07819 చర్లపల్లి-తిరుపతి 25.06.2026, 27.06.2026 తేదీల్లో గురు, శనివారం రెండు సర్వీసులు ఉంటాయి. చర్లపల్లి నుంచి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ట్రైన్ వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 07:30కి తిరుపతి చేరుకుంటుంది.
07820 తిరుపతి-చర్లపల్లి 26.06.2026, 28.06.2026 తేదీల్లో శుక్ర, ఆది వారాల్లో 2 సర్వీసులు నడుస్తాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 4:30కి చర్లపల్లికి చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.