...
...
Next Story

ఇవాళ్టి నుంచి విజయవాడలో ‘బుక్ ఫెయిర్’ - ప్రతి స్టాల్ లోనూ డిస్కౌంట్, టైమింగ్స్ వివరాలివే

విజయవాడ బుక్ ఫెయిర్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. జనవరి 12వ తేదీ వరకు ఈ పుస్తక మహోత్సవం జరగనుంది. ప్రతి స్టాల్‌లోనూ ఏ పుస్తకం కొనుగోలు చేసినా దానిపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తారు.

Published on: Jan 2, 2026, 11:18:44 IST
Advertisement

పుస్తక ప్రియులకు అద్భుతమైన అవకాశం వచ్చేసింది. ఇవాళ్టి నుంచి విజయవాడలో 36వ పుస్తక మహోత్సవం(బుక్ ఫెయిర్) ప్రారంభం కానుంది. జనవరి 12వ తేదీతో ఈ బుక్ ఫెయిర్ కార్యక్రమం ముగుస్తుంది. ఇందుకోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

విజయవాడలో బుక్ ఫెయిర్ - ముఖ్యమైన వివరాలు:

  • విజయవాడ సిటీలోని ఇందిరాగాంధీ నగరపాలక క్రీడాప్రాంగణంలో బుక్ ఫెయిర్ ఉంటుంది.
  • బుక్ ఫెయిర్ ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన సాహిత్య వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్ పేరు పెట్టారు.
  • ప్రతిభా వేదికకు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్‌ నార్లీకర్‌ పేర్లను ఖరారు చేశారు.
  • జనవరి 2వ తేదీ నుంచి జవవరి 12వ తేదీ వరకు ఈ బుక్ ఫెయిర్ అందుబాటులో ఉంటుంది.
  • ప్రతి రోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక శనివారం, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంటకే పుస్తక కేంద్రాలు తెరుస్తారు.
  • ఈసారి మొత్తం 309 స్టాళ్లు ఏర్పాటవుతాయి.
  • ప్రతి స్టాల్‌లోనూ10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఏ పుస్తకం కొనుగోలు చేసినా ఈ నిర్ణయం వర్తిస్తుంది.
  • పుస్తక మహోత్సవంలో భాగంగా జనవరి 6వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. జనవరి 9వ తేదీన ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పాల్గొంటారు.

విజయవాడలో పుస్తక మహోత్సవం
విజయవాడలో పుస్తక మహోత్సవం

ప్రతి ఏడాది నిర్వహించబోయే ఎన్నో వైవిద్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు బుక్​ఫెయిర్​కు వస్తాయి. తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ, ఎమెస్కో, తెలుగు బుక్స్​, సేజ్, పెంగ్విన్, నవయుగ వంటి పుస్తక ప్రచురణ సంస్థలు అన్నీ ఒకే దగ్గర కనిపించనున్నాయి. విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాలతో బుక్​ఫెయిర్​ కొనసాగనుంది. ప్రతి ఏడాది జరిగే ఈ అతిపెద్ద పుస్తక మహోత్సవం కోసం పుస్తకప్రియులు ఎంతో ఆసక్తికగా ఎదురూచూస్తుంటారు. పుస్తకాలను కూడా భారీగానే విక్రయిస్తుంటారు. ఈసారి కూడా భారీగానే పుస్తకాలు కొనుగోలు కానున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe