పుస్తక ప్రియులకు తీపికబురు - ఈనెల 19 నుంచి ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’… టైమింగ్స్ ఇలా...

ప్రతి ఏడాది నిర్వహించే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం తేదీలు ఖరారయ్యాయి.  38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు జరగనుంది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తకాలను విక్రయిస్తారు.

Published on: Dec 14, 2025, 08:57:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుస్తక ప్రియులకు శుభవార్త వచ్చేసింది. ప్రతి ఏడాది నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభ తేదీలను ప్రకటించారు. ఈనెల 19వ తేదీ నుంచి ఈ మెగా బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 29వ తేదీతో ముగియనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ అధ్యక్షుడు యాకూబ్‌ వెల్లడించారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన యాకూబ్ సాహితీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్ వేళ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని తెలిపారు.

ఎన్నో వైవిద్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు బుక్​ఫెయిర్​కు వస్తాయి. తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ, ఎమెస్కో, తెలుగు బుక్స్​, సేజ్, పెంగ్విన్, నవయుగ వంటి పుస్తక ప్రచురణ సంస్థలు అన్నీ ఒకే దగ్గర కనిపించనున్నాయి. విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాలతో బుక్​ఫెయిర్​ కొనసాగనుంది. ప్రతి ఏడాది జరిగే ఈ అతిపెద్ద పుస్తక మహోత్సవం కోసం పుస్తకప్రియులు ఎంతో ఆసక్తికగా ఎదురూచూస్తుంటారు. పుస్తకాలను కూడా భారీగానే విక్రయిస్తుంటారు. ఈసారి కూడా భారీగానే పుస్తకాలు కొనుగోలు కానున్నాయి.

పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు సౌకర్యంగా ఉండేలా…. బుక్ ఫెయిర్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, సంస్కృతం, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషాకు సంబంధించిన పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్‌లో లభ్యమవుతాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, యువత, పెద్దలు ఇలా అందరూ బుక్ ఫెయిర్ను సందర్శించి విజయవంతం చేయాలని కోరారు. పుస్తక ప్రదర్శనలో స్టాల్‌ ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More