తిరుమలలో భక్తుల రద్దీ - అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫార్సు లేఖల స్వీకరణను కూడా నిలిపివేసింది.

Published on: Sep 29, 2026, 08:06:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పవిత్ర పెరటాసి మాసం నడుస్తుండటం… దీనికితోడు వరుస సెలవులు రాబోతుండటంతో రాబోయే రోజుల్లో కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ, వారికి త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలపై తాత్కాలిక నిబంధనలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు
అక్టోబర్ 1, 5 తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు

ఈ తేదీల్లో బ్రేక్ దర్శనాలు రద్దు…

టీటీడీ నిర్ణయం ప్రకారం అక్టోబర్ 1వ తేదీ గురువారం, అలాగే అక్టోబర్ 5వ తేదీ సోమవారం నాడు కేవలం ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. ఇతర సాధారణ వీఐపీలకు, దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ మార్పులకు అనుగుణంగా, బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన రోజులకు ముందు రోజు అనగా సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం, అక్టోబర్ 4వ తేదీ ఆదివారం ఎలాంటి సిఫార్సు లేఖలనూ టీటీడీ అధికారులు స్వీకరించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని యంత్రాంగం కోరింది.

ప్రస్తుతం తిరుమలలో రోజుకు దాదాపు 80 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అయితే… అదే రోజున అదనంగా మరో 30 వేల మందికి పైగా భక్తులు కొండపైకి వస్తున్నారు. దీంతో దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు మరుసటి రోజు వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నిరీక్షణ సమయం సామాన్య ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోంది.

సామాన్య భక్తుల కష్టాలను తగ్గించడమే ధ్యేయంగా టీటీడీ ఈ చర్యలు చేపట్టింది. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని తగ్గించడం ద్వారా మిగిలే సమయాన్ని నేరుగా సాధారణ క్యూలైన్లకు కేటాయిస్తారు. దీనివల్ల వేలాది మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగా పూర్తవుతుంది. కొండపై నెలకొన్న భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులందరూ సహకరించాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More