ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి జోరు నడుస్తున్న వేళ.. నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన ఇలాఖా అయిన నందికొట్కూరులో తన రాజకీయ చాతుర్యాన్ని, నియోజకవర్గంపై తనకున్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా నడుస్తున్నప్పటికీ, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యూహాత్మక అడుగులతో నందికొట్కూరు మున్సిపాలిటీ పీఠాన్ని వైసీపీ తన ఖాతాలో వేసుకుని ఘన విజయం సాధించింది. నందికొట్కూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉత్కంఠభరితంగా సాగింది. ప్రారంభ రౌండ్ల నుంచే వైఎస్సార్సీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
మొత్తం 32 వార్డులు ఉండగా.. వైఎస్సార్సీపీ 23 వార్డులు విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 9 వార్డులు సొంతం చేసుకుంది. స్థానిక సంస్థల పోరులో 32 వార్డులకు గాను ఏకంగా 23 స్థానాలను దక్కించుకుని మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసింది. ప్రతిపక్ష టీడీపీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది.
నందికొట్కూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్సార్సీపీ నాయకురాలు ఫాతిమా బీ అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ప్రత్యర్థి అభ్యర్థిపై ఏకంగా 4,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించారు. ఫాతిమా బీ విజయం ఖరారవ్వడంతో నందికొట్కూరు మున్సిపల్ పీఠం వైసీపీ చేతిలోకి వెళ్లిపోయింది. ఈ ఫలితంతో లెక్కింపు కేంద్రం వద్ద వైసీపీ శ్రేణుల కోలాహలం మిన్నంటింది.
నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ప్రజల్లో, యువతలో ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ఆయన ప్రతి వార్డులోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను సమన్వయం చేస్తూ, ప్రతి ఓటరును కలిసి ప్రచారం ముమ్మరం చేశారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
{{/usCountry}}నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ప్రజల్లో, యువతలో ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ఆయన ప్రతి వార్డులోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను సమన్వయం చేస్తూ, ప్రతి ఓటరును కలిసి ప్రచారం ముమ్మరం చేశారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
{{/usCountry}}నియోజకవర్గంలో బైరెడ్డి వర్గం కనబరిచిన సమష్టి కృషి, సిద్ధార్థ్ రెడ్డి నాయకత్వం వైఎస్సార్సీపీ విజయాన్ని ఏకపక్షం చేసింది. నందికొట్కూరులో పార్టీ సాధించిన ఘనవిజయంతో నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వెలుపల పెద్దఎత్తున బాణాసంచా కాల్చి, రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నాయకత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ విజయంతో నంద్యాల జిల్లా రాజకీయాల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన తిరుగులేని నాయకత్వాన్ని, నందికొట్కూరు గడ్డపై ఫ్యాన్ గుర్తుకున్న ప్రజాదరణను మరోసారి రుజువు చేసుకున్నారు.