అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను పార్లమెంటు ఏప్రిల్ 2న ఆమోదించింది. దాదాపు ఐదు గంటల చర్చ అనంతరం ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించింది. ఏ చట్టమైనా అమలులోకి రావడానికి అనుసరించే ప్రక్రియ ప్రకారం, దీనిని భారత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.

లోక్‌సభ, రాజ్యసభలు ఇప్పటికే దీనిని ఆమోదించినందున, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కేవలం లాంఛనం మాత్రమే. అయితే రాష్ట్రపతి ఆమోదం తెలిపే ముందు ఈ బిల్లును పరిశీలించి, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ద్రౌపది ముర్ము ఈ తీర్మానంపై అధికారికంగా సంతకం చేసిన వెంటనే.. అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా ప్రకటిస్తారు.
ఒక బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదం చివరి దశ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ.. ఇతర పార్టీల నుండి అమరావతి చట్టబద్ధతకు రాజకీయ మద్దతు లభించింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో 2025 జూన్ 2వ తేదీ నుండి వర్తించే విధంగా అమరావతిని రాజధానిగా గుర్తించినట్లు అవుతుంది. రాష్ట్రపతి వీలైనంత త్వరగా ఈ బిల్లుకు తన ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక రాజధానిగా ఆమోదించడాన్ని స్వాగతిస్తూ.. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, మహిళలు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో ఉన్న కనకదుర్గ అమ్మవారి వద్దకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి చీరలు, మిఠాయిలు సమర్పించారు.
2026 మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానం, అమరావతిని రాజధానిగా స్పష్టంగా పేర్కొంటూ, గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనల వల్ల ఏర్పడిన అస్పష్టతను తొలగించడానికి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5కు సవరణ చేయాలని కోరింది.
{{/usCountry}}2026 మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానం, అమరావతిని రాజధానిగా స్పష్టంగా పేర్కొంటూ, గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనల వల్ల ఏర్పడిన అస్పష్టతను తొలగించడానికి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5కు సవరణ చేయాలని కోరింది.
{{/usCountry}}2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం, 2014 జూన్ 2 నుండి ఒక దశాబ్దం పాటు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా పనిచేసింది. ఇది 2024 జూన్ 2న ముగిసింది, ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణకు ఏకైక రాజధానిగా మారింది.
అమరావతిని చట్టబద్ధమైన మద్దతుతో రాజధానిగా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ప్రభుత్వం అభిప్రాయపడింది. భవిష్యత్‌లో ఏ ప్రభుత్వమూ.. రాజధానిని మార్చకుండా లేదా విభజించకుండా ఆపేందుకు ఈ చట్టాన్ని సవరించడమే ఏకైక మార్గమని విశ్వసించింది.