Capital Amaravati : రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అమరావతి చట్టబద్ధత బిల్లు
Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను పార్లమెంటు ఏప్రిల్ 2న ఆమోదించింది. దాదాపు ఐదు గంటల చర్చ అనంతరం ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించింది. ఏ చట్టమైనా అమలులోకి రావడానికి అనుసరించే ప్రక్రియ ప్రకారం, దీనిని భారత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.

లోక్‌సభ, రాజ్యసభలు ఇప్పటికే దీనిని ఆమోదించినందున, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కేవలం లాంఛనం మాత్రమే. అయితే రాష్ట్రపతి ఆమోదం తెలిపే ముందు ఈ బిల్లును పరిశీలించి, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ద్రౌపది ముర్ము ఈ తీర్మానంపై అధికారికంగా సంతకం చేసిన వెంటనే.. అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా ప్రకటిస్తారు.
ఒక బిల్లు చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదం చివరి దశ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించినప్పటికీ.. ఇతర పార్టీల నుండి అమరావతి చట్టబద్ధతకు రాజకీయ మద్దతు లభించింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో 2025 జూన్ 2వ తేదీ నుండి వర్తించే విధంగా అమరావతిని రాజధానిగా గుర్తించినట్లు అవుతుంది. రాష్ట్రపతి వీలైనంత త్వరగా ఈ బిల్లుకు తన ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక రాజధానిగా ఆమోదించడాన్ని స్వాగతిస్తూ.. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, మహిళలు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో ఉన్న కనకదుర్గ అమ్మవారి వద్దకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి చీరలు, మిఠాయిలు సమర్పించారు.
2026 మార్చి 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ, అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానం, అమరావతిని రాజధానిగా స్పష్టంగా పేర్కొంటూ, గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనల వల్ల ఏర్పడిన అస్పష్టతను తొలగించడానికి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5కు సవరణ చేయాలని కోరింది.
2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం, 2014 జూన్ 2 నుండి ఒక దశాబ్దం పాటు హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా పనిచేసింది. ఇది 2024 జూన్ 2న ముగిసింది, ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణకు ఏకైక రాజధానిగా మారింది.
అమరావతిని చట్టబద్ధమైన మద్దతుతో రాజధానిగా స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ప్రభుత్వం అభిప్రాయపడింది. భవిష్యత్‌లో ఏ ప్రభుత్వమూ.. రాజధానిని మార్చకుండా లేదా విభజించకుండా ఆపేందుకు ఈ చట్టాన్ని సవరించడమే ఏకైక మార్గమని విశ్వసించింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


