ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో మెుంథా తుపాను వల్ల జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం సోమ, మంగళవారాల్లో పర్యటిస్తోంది. హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలోని బృందం (IMCT) తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి నష్టాల పరిధిని అంచనా వేస్తుంది.

'నష్టాలను పరిశీలించడానికి, ప్రభావిత కుటుంబాలతో నేరుగా సంభాషించడానికి కేంద్ర బృందం రెండు రోజుల పాటు ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుంది.' అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ తెలిపారు.
ప్రఖార్ జైన్ ప్రకారం, సోమవారం టీమ్-1 బాపట్ల జిల్లాను, టీమ్-2 కృష్ణ, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలను సందర్శిస్తాయి, మరుసటి రోజు ఈ బృందాలు ప్రకాశం, కోనసీమ జిల్లాలను పర్యటిస్తాయని తెలిపారు. కేంద్ర బృందంలో వ్యవసాయం, వ్యయం, జల వనరులు, రహదారులు, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, ఇతర విభాగాల అధికారులు ఉన్నారని, వీరు భారత ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని జైన్ అన్నారు.
ఈ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తాయని, వ్యవసాయం, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల నష్టాలను సమీక్షిస్తాయని, ప్రభుత్వ మూల్యాంకనం, సహాయం కోసం తుపాను ప్రభావంపై నివేదికలను సిద్ధం చేస్తాయని ప్రఖార్ జైన్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాల్లో మెుంథా తుపాను కారణంగా సంభవించిన విధ్వంసం, భారీ వర్షాల సమయంలో పంట నష్టం, మౌలిక సదుపాయాల నష్టం, బాధిత కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటనల నేపథ్యంలో కేంద్రం బృందం ఏపీలో పర్యటిస్తుంది.
APSDMA ప్రకారం, కేంద్ర బృందం నివేదిక.. పునరావాసం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి కేంద్ర సహాయం కోసం మెమోరాండంను ఖరారు చేయడంలో సహాయపడుతుంది. క్షేత్రస్థాయి నష్టాల కచ్చితమైన అంచనా, అవసరమైన పునరుద్ధరణ చర్యలను కేంద్ర బృందానికి సమర్పించడానికి జిల్లా పరిపాలనల నుండి వివరణాత్మక నష్ట నివేదికలను సిద్ధం చేస్తున్నారు.
{{/usCountry}}APSDMA ప్రకారం, కేంద్ర బృందం నివేదిక.. పునరావాసం, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి కేంద్ర సహాయం కోసం మెమోరాండంను ఖరారు చేయడంలో సహాయపడుతుంది. క్షేత్రస్థాయి నష్టాల కచ్చితమైన అంచనా, అవసరమైన పునరుద్ధరణ చర్యలను కేంద్ర బృందానికి సమర్పించడానికి జిల్లా పరిపాలనల నుండి వివరణాత్మక నష్ట నివేదికలను సిద్ధం చేస్తున్నారు.
{{/usCountry}}