Srisailam Darshan Timings : శ్రీశైలం వెళ్తున్నారా..? దర్శనం టైమింగ్స్ లో మార్పులు! కొత్త రూల్స్ ఇవే

Srisailam VIP Break Darshan : వారాంతపు రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా శ్రీశైల దేవస్థానం వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చేసింది. శని, ఆది, సోమవారాల్లో రాత్రి 9 గంటలకే వీఐపీ బ్రేక్ టికెట్ దారులకు స్పర్శదర్శనం కల్పిస్తారు. 

Published on: Jul 19, 2026, 09:45:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Srisailam VIP Break Darshan : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల్లో కీలక మార్పులు చేసినట్లు దేవస్థానం ఛైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో ఎం.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో సంయుక్తంగా తెలిపారు. వారాంతాల్లో క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా… రద్దీని క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.

శ్రీశైలం
శ్రీశైలం

కొత్త దర్శన వేళల వివరాలు:

  • వారాంతపు రోజుల్లో (శని, ఆది, సోమవారాలు) : ఈ మూడు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు కేవలం రాత్రి 9 గంటల సమయంలోనే స్పర్శదర్శనం కల్పిస్తారు.
  • ఆన్‌లైన్ భక్తులకు యథావిధిగా : 'మనమిత్ర' వాట్సప్ మరియు ఆన్‌లైన్‌ విధానాల ద్వారా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం ఉదయం 7.30 గంటలకు కల్పించే స్పర్శదర్శనంలో ఎలాంటి మార్పూ లేదు, అది యథావిధిగా కొనసాగుతుంది.

వారాంతాల్లో శ్రీశైలానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, అందరికీ స్వామివారి దర్శనం సజావుగా సాగేలా చూసేందుకే ఈ మార్పులు చేసినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ మార్పులతో సాధారణ భక్తులకు దర్శన సౌకర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కొత్త విధానాలను భక్తులు గమనించి దేవస్థాన సిబ్బందికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్ రమేశ్ నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More