అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌లో 50 పార్టీలు ఉంటే వైసీపీ మినహా అన్ని పార్టీలు రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మద్దతు పలికాయన్నారు. ఈ రాష్ట్రంలో ఓట్లు పొంది, ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన వ్యక్తులు మాత్రం రాష్ట్రానికే ద్రోహం చేసేలా వ్యవహరించారన్నారు.

'అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకించారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత దీనికి పూర్తి స్థాయి చట్టబద్ధత వస్తుంది. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను రాజకీయ వైరుద్యాలు, వ్యక్తిగత బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని పార్టీలు సహకారం ఇచ్చాయి. కానీ ఒక్క వైసీపీ మాత్రమే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది.' అని చంద్రబాబు అన్నారు.
దేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు కూడా సహకరిస్తాయని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ రాష్ట్రం నాశనమైనా ఫర్వాలేదని పట్టుదలగా వ్యవహరించారన్నారు. అమరావతి నాశనం అయినా ఫర్వాలేదని అనుకున్నారు.. కానీ మనం శాసనం చేసుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ రాజముద్రతో 5 కోట్ల ఆంధ్రుల ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాయన్నారు.
అమరావతిని ఇక భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని, విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ భావోద్వేగాలు ఉన్నాయన్నారు చంద్రబాబు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం సంపద సృష్టికి ఓ ప్రాంతం తయారు కావాలనే హైదరాబాద్ లో సైబరాబాద్ నిర్మాణం చేశామన్నారు. రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని ఆ రోజు చెప్పామని, చాలా అంశాలు పరిష్కారం కాకున్నా విభజన జరిగిందన్నారు.
ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, వనరులు లేవు అన్నీ ఇబ్బందులే.. అక్కడి నుంచే మొదలయ్యాం అని చంద్రబాబు అన్నారు. అప్పాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే తెలంగాణలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరానన్నారు. తెలంగాణకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. తెలంగాణకు నష్టం కలగాలని ఎప్పుడూ కోరుకోనని చంద్రబాబు చెప్పారు.
{{/usCountry}}ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, వనరులు లేవు అన్నీ ఇబ్బందులే.. అక్కడి నుంచే మొదలయ్యాం అని చంద్రబాబు అన్నారు. అప్పాయింటెడ్ డే జూన్ 2 కంటే ముందే తెలంగాణలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపాలని కోరానన్నారు. తెలంగాణకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. తెలంగాణకు నష్టం కలగాలని ఎప్పుడూ కోరుకోనని చంద్రబాబు చెప్పారు.
{{/usCountry}}'ఇవాళ హైదరాబాద్ లో ఇంతటి సంపద కలిగిందంటే సైబరాబాద్ లాంటి నగరాల నిర్మాణమే. చాలా మంది ఎంపీలు గుర్తించి పార్లమెంటులోనూ ఇది ప్రస్తావించారు. ఆ గౌరవాన్ని ఎప్పుడూ పోగొట్టుకోను. రాజధాని లేకుండా విజయవాడకు వచ్చాం. ఒక ఎస్ఈ కార్యాలయంలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని, బస్సులో బస చేసి కార్యకలాపాలు ప్రారంభించాం. ఏమీ లేకుండా రాష్ట్రం ఏర్పడిందనటానికి అవే ప్రత్యక్ష ఉదాహరణ.' అని చంద్రబాబు అన్నారు.
శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తే 46 శాతం మంది ప్రజలు విజయవాడ- గుంటూరు మధ్య రాజధానికి ఏర్పాటుకు అనుకూలమని పేర్కొన్నారన్నారు. అయితే వైసీపీ చాలా డ్రామాలు ఆడిందని. అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఓ రాజధాని ఉండాలని మేం సంకల్పం చేశామని చంద్రబాబు గుర్తుచేశారు.
ఆ సంకల్పంలో భాగమే మూడు ప్రాంతాలకు సమాన దూరంలో ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం మధ్యలో ఉన్న ప్రాంతంగా, కనెక్టివటీ పరంగా, భౌగోళికంగా, చారిత్రాత్మక ప్రదేశంగా రాజధానిగా ఎంపిక చేసి ప్రణాళికలు చేశామన్నారు.
'సింగపూర్ ఒక్క పైసా తీసుకోకుండా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి మనకు ఇచ్చింది. అత్యంత సారవంతమైన, ఖరీదైన భూములు ఇవి. పిలుపు ఇవ్వగానే 29 వేల మంది రైతులు 34 వేల ఎకకరాలను ఇచ్చారు. ప్రభుత్వ భూమి కూడా కలిపితే 54 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. అభివృద్ధిలో రైతులను కూడా భాగస్వాములను చేసేలా వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ను తీసుకువచ్చాం. తమ భవిష్యత్తు బాగుంటుందని రైతులకూ విశ్వాసం కలిగింది. జరీబు భూములు కలిగిన వారికి 450 కమర్షియల్, 1000 గజాలు రెసిడెన్షియల్ రిటర్నబుల్ ప్లాట్ లు ఇచ్చాం. ప్రతీ ఏటా యాన్యుటీ కూడా రైతులకు ఇస్తున్నాం. భూమిలేని రైతులకు కూడా పెన్షన్లు అదనంగా ఇస్తున్నాం.' అని చంద్రబాబు అన్నారు.