...
...
Next Story

Konaseema ONGC Blowout : బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే - నష్టపరిహారంపై ఆదేశాలు

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఇరుసుమండలో సంభవించిన బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్‌ కుమార్‌ తదితరులతో రాయవరంలో సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.

Published on: Jan 9, 2026, 16:51:28 IST
Advertisement

డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఘటనపై ఓఎన్జీసీ అధికారులు, కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ మహేష్ కుమార్, ఎంపీ శ్రీ హరీష్‌ బాలయోగి, ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద్‌తో మండపేట నియోజకవర్గం, రాయవరంలో సమీక్ష నిర్వహించారు. బ్లో అవుట్ నివారణకు సంబంధించిన చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. మంటల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పరిహారం వేగవంతం చేయాలి - సీఎం ఆదేశాలు

సీఎం చంద్రబాబు ఏరియల్ రివ్యూ
సీఎం చంద్రబాబు ఏరియల్ రివ్యూ

ఘటనా ప్రాంతంలో మంటల తీవ్రత కాస్త తగ్గడం మొదలైనప్పటికీ… వరుసగా ఐదవ రోజు కూడా మంటలు కొనసాగుతున్నాయి. మంటలను పూర్తిగా ఆర్పడానికి తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అగ్నిప్రమాదంలో ధ్వంసమైన కొబ్బరి తోటలు ధ్వంసమైన స్థానిక రైతులకు పరిహారం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రెజర్ కంట్రోల్ సిస్టమ్స్ యొక్క వైఫల్యం తరువాత, చమురు బావి లేదా గ్యాస్ బావి నుండి ముడి చమురు లేదా సహజ వాయువును అనియంత్రితంగా విడుదల చేయడాన్ని బ్లోఅవుట్ అని అంటారు. ఇదిలా ఉండగా… మంటలను ఆర్పే ప్రయత్నాలు నేటికీ కొనసాగాయి. శిథిలాలను తొలగించడంపై ఓఎన్జీసీ సిబ్బంది దృష్టి సారించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks