కోనసీమలో ఇంకా అదుపులోకి రాని మంటలు.. ముంబయి, ఢిల్లీ నుండి ఓఎన్జీసీ నిపుణులు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. గ్యాస్ మంటలను ఆర్పడానికి ముంబయి, ఢిల్లీ నుండి ఓఎన్జీసీ నిపుణుల బృందాలు వచ్చాయి.

Published on: Jan 6, 2026, 13:16:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో గ్యాస్ బ్లోఅవుట్ వద్ద మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. జనవరి 5న మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో ఇరుసుమండ గ్రామాల సమీపంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) యాజమాన్యంలోని మోరి-5 బావి వద్ద గ్యాస్ లీక్ అయింది. తర్వాత 20 మీటర్ల ఎత్తు, 25 మీటర్ల వెడల్పుతో మంటలు చెలరేగాయి.

ఓఎన్జీసీ గ్యాస్ లీక్
ఓఎన్జీసీ గ్యాస్ లీక్

అయితే ఈ గ్యాస్ బావిని అహ్మదాబాద్‌కు చెందిన ఎన్‌హాన్స్‌మెంట్ కాంట్రాక్టర్ డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.

'మంటలు తగ్గించడానికి నీటి గొడుగును సృష్టించారు. పెద్ద పైప్‌లైన్ ద్వారా గొడుగు రూపంలో నీటిని లోపలకు చొప్పిస్తున్నారు. కానీ మంటలు ఇంకా వస్తున్నాయి, నిపుణుల బృందాలు వచ్చాయి. వారు పరిస్థితిని అంచనా వేస్తారు. తదనుగుణంగా మంటలను ఆర్పడానికి అన్ని చర్యలు తీసుకుంటారు.' అని కోనసీమ జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు.

ముంబై, ఢిల్లీ నుండి నిపుణుల బృందాలు వచ్చాయని జాయింట్ కలెక్టర్ చెప్పారు. నీటిని చల్లడం ద్వారా మంటల చుట్టూ ఉన్న చెట్లన్నీ చల్లబడుతున్నాయని, సోమవారంతో పోలిస్తే మంటల తీవ్రత తగ్గిందని నిశాంతి వెల్లడించారు. వీలైనంత త్వరగా మంటలు అదుపులోకి వస్తాయని తాము ఆశిస్తున్నామన్నారు. దానిని ఆర్పడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఓఎన్జీసీ నిపుణుల బృందం ముందుగా పరిస్థితిని అంచనా వేస్తారు. అంచనా ఆధారంగా మాత్రమే వారు చెప్పగలరని నిశాంతి అన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు, ఓఎన్‌జీసీ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, రెడ్‌క్రాస్ సిబ్బంది మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్నారు.

సోమవారం అగ్నిప్రమాదం జరిగిన చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల నుండి 600 మందిని భద్రత కారణాల దృష్ట్యా తరలించారు. ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ బావిలో మరమ్మతులు, సాంకేతిక పనులు జరుగుతున్న సమయంలోనే ప్రమాదం సంభవించింది. లీకైన గ్యాస్‌కు నిప్పు రవ్వలు అంటుకున్న కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.

ఈ మంటల వేడి కారణంగా కొబ్బరి చెట్లు కాలిపోయాయి. పంట పొలాలు, ఆక్వా సాగుకు కూడా పెద్ద నష్టం జరుగుతుందని అంచనా. అగ్నికీలల్లో డ్రిల్లింగ్ రిగ్, లాగింగ్ టూల్స్, భారీ వాహనాలు పాడైపోయాయి. నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీ రాజమండ్రి అసెట్ ఉత్పత్తి మెరుగుదల కార్యకలాపాల కోసం డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2024లో రూ.1,402 కోట్ల ఒప్పందాన్ని పొందింది . ఆ కంపెనీ మోరి-5 బావిని దాదాపు ఒక సంవత్సరం నుండి నిర్వహిస్తోందని ఓఎన్జీసీ అధికారి ఒకరు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More