కోనసీమ కోకోనట్ మార్కెట్‌కు తమిళనాడు కొబ్బరి కాయల ఎఫెక్ట్.. తగ్గిన ధరలు, ఎగుమతులు!
కోనసీమ కొబ్బరి కాయల మార్కెట్‌పై తమిళనాడు కొబ్బరి కాయలు ప్రభావం చూపిస్తున్నాయి. దీనితోపాటుగా పలు కారణాలు కొబ్బరి ధరలు తగ్గడానికి కారణం అయ్యాయి.
రెండు మూడు నెలల క్రితం కొబ్బరి ధరలు ఎంత పెరిగాయో.. ఇప్పుడు అంతకుఅంత తగ్గుతున్నాయి. గత 15 రోజుల్లో చూసుకుంటే.. కొబ్బరికాయల ధరలు సుమారు 50 శాతానికి పైగా పడిపోయాయి. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులో పంట బాగా పండడమే డిమాండ్ తగ్గడానికి, ధరలు పతనానికి ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది.

ధరలు మరింత తగ్గడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. పండుగ సీజన్ కూడా ముగిసింది. నిజానికి కార్తీక మాసంలో కోనసీమ నుంచి పెద్ద ఎత్తున కొబ్బరి ఎగుమతి అయింది. దీపావళి, కార్తీక మాసం అయిపోవడం, మరోవైపు శుక్ర మౌఢ్యమి కారణంగా ధరలు దారుణంగా పడిపోయాయి. మరోవైపు కేరళ, తమిళనాడులో అధిక దిగుబడి కూడా కోనసీమ కొబ్బరి మార్కెట్ మీద ప్రభావం చూపిస్తోంది. సంక్రాంతి సీజన్ వరకు కొబ్బరి ధరల్లో పెరుగుదల ఉండకపోవచ్చు. అప్పటి వరకు రైతులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
కోనసీమ కొబ్బరి వ్యాపారుల అభిప్రాయం ప్రకారం, కొబ్బరి ధర రూ.26 నుండి రూ.14కి తగ్గింది. 15, 20 రోజుల క్రితం వరకు రోజుకు 100 ట్రక్కులు కొబ్బరి లోడు బయలుదేరేది. ఇప్పుడు ఆ సంఖ్య 20 ట్రక్కులకు పడిపోయింది. కోనసీమ జిల్లా నుండి బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు అవుతాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత కూడా కొబ్బరి మీద ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. తమిళనాడు మార్కెట్ నుంచి అధికంగా రావడం వల్ల కోనసీమ మార్కెట్‌లో ధరలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు.
తమిళనాడు రైతులు దిగుబడిని పెంచడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కోనసీమలో రైతులు ఇప్పటికీ చెట్ల నుండి కొబ్బరిని తీయడానికి మాన్యువల్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అందువల్ల నాణ్యత మీద కూడా ప్రభావం పడుతుంది. తమిళనాడులో 16 జిల్లాల్లో కొబ్బరి సాగు ఉంది.
ఉత్తరాది రాష్ట్రాలు, తెలంగాణలో రాఖీ, దీపావళి, కార్తీక మాసం, శ్రీరామనవమి, దసరా, ఇతర పండుగల సమయంలో, మహారాష్ట్రలో వినాయ చతుర్థి సమయంలో కొబ్బరికి అధిక డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వెయ్యి పచ్చి కొబ్బరికాయల ధర రూ.12 వేల నుంచి రూ.14 వేల మధ్య పలుకుతోంది. అదే రెండు నెలల క్రితం ఈ ధర రూ.28 వేల వరకు ఉన్నది.
తమిళనాడు మార్కెట్లో కొబ్బరికాయల అదనపు సరఫరా కేవలం ఒక సాకు మాత్రమే అని కొందరు చెబుతున్నారు. తమిళనాడు నుంచి అధిక ఎగుమతుల కారణంగా ధర స్వల్పంగా మాత్రమే పెరిగిందంటున్నారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గిస్తున్నారనే వాదన కూడా ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


