...
...
Next Story

జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పులు...! ఈనెల 31న ఫైనల్ నోటిఫికేషన్

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘ చర్చించారు. డిసెంబర్ 31వ తేదీన తుది నోటిఫికేషన్ జారీ కానుంది.

Published on: Dec 27, 2025 05:08 PM IST
Advertisement

ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల కాగా… వీటిపై అభ్యంతరాల గడువు నేటితో ముగుస్తోంది. దీంతో వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

అభ్యంతరాలపై చర్చ…!

ఏపీ జిల్లాల పునర్విభజన - సీఎం చంద్రబాబు సమీక్ష
ఏపీ జిల్లాల పునర్విభజన - సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సమీక్షించిన సీఎం చంద్రబాబు…. మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. కొన్నింటిని మార్పు చేసే విషయంపై సమాలోచనలు జరిపారు. అయితే రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లెలో కలిపే ప్రతిపాదనలపై చర్చించినట్లు తెలిసింది.

ఇప్పటికే ప్రకటించిన మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాలతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి పెరగాల్సి ఉంది. అయితే తాజా ప్రతిపాదనలు, జరిగిన చర్చల నేపథ్యంలో….. 28 జిల్లాలకే పరిమితం చేసే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిని మదనపల్లెలో కలిపే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. వీటన్నింటిపై సాధ్యాసాదాలు పరిశీలన పూర్తి కాగానే… డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి రియాక్షన్:

అన్నమయ్య జిల్లా ముక్కలు కాబోతోందంటూ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలను అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. జిల్లా ముక్కలు కాబోతోందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. ఇది ఫైనల్ నిర్ణయం కాదని… చర్చలు తర్వాతనే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe