రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ కార్యక్రమం - త్వరలోనే 75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… త్వరలోనే 75 లక్షల మంది విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

Published on: Dec 21, 2025, 05:15:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిన్న చిన్న ఆలోచనలు ఒక్కో సందర్భంలో అభివృద్ధికి బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముస్తాబు కార్యక్రమాన్ని శనివారం సీఎం ప్రారంభించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా సీఎం పరిశీలించారు.

విద్యార్థినిలతో సీఎం చంద్రబాబు
విద్యార్థినిలతో సీఎం చంద్రబాబు

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని తాళ్లపాలెం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రారంభిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థినులతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...”విద్యార్ధుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టాం. పాఠశాలకు చక్కటి యూనిఫాంతో, పరిశుభ్రంగా చదువుకోవాలి. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ముస్తాబు కార్యక్రమం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ తరహా కార్యక్రమాల వల్ల విద్యార్ధుల్లో శ్రద్ధ వస్తుంది" అని చెప్పారు.

విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షలు - సీఎం చంద్రబాబు

“ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో 75 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ వరకూ చదువుతున్నారు. ముస్తాబు లాంటి కార్యక్రమం వల్ల వ్యక్తిగత శుభ్రతతో పాటు నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి. చక్కగా తలదువ్వుకోవటం, భోజనానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే ముస్తాబు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలతో మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు రావాలని కోరుతున్నాను” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

“తల్లితండ్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులపైనే ఆశలు పెట్టుకుంది. అందరికీ తల్లికి వందనం కింద ఆర్ధిక సాయం అందించాం. విద్యార్ధులు మెరుగైన ఫలితాలు సాధించాలనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, భోజనం అన్నీ ఉచితంగానే ఇస్తున్నాం. జీవితంలో ఏం సాధించాలన్నా చిన్న వయస్సు నుంచే కృషి చేయాలి. విద్యార్ధులంతా రాష్ట్రానికి చెందిన ఆస్తి. విద్యార్థులు నాలెడ్జి ఎకానమీలో భాగం కావాలి. మంచి ఉపాధి, ఉద్యోగాల్లో విద్యార్ధులంతా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

"రాష్ట్రవ్యాప్తంగా 75 లక్షల మంది విద్యార్ధుల ఆరోగ్యాన్ని కూడా త్వరలోనే పరీక్షిస్తాం. విద్యార్థులంతా ఆరోగ్యంగా ఉండేలా మంచి పౌష్టికాహారం ఇస్తున్నాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యాశాఖలో వినూత్నమైన సంస్కరణలు తీసుకువస్తున్నారు. వివిధ శాఖల మంత్రులు కూడా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకే కృషి చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మార్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కొన్ని ఆలోచనలు అందరిలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తాయి. అలాంటి కార్యక్రమమే ముస్తాబు. అందుకే దీన్ని అన్ని చోట్ల అమలు చేయాలని నిర్ణయించాం.”అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More