డిజి నెర్వ్ సెంటర్ ప్రారంభం.. నీవా బ్రాంచ్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
సంక్రాంతి పండుగ వేళ తన స్వగ్రామంతో పాటు తిరుపతిలో సీఎం చంద్రబాబు పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు.
ప్రజారోగ్య ప్రాజెక్టు సంజీవనిని చిత్తూరు జిల్లాకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. గత ఏడాది కుప్పంలో పైలట్ గా ప్రారంభించిన డిజి నెర్వ్ సెంటర్ డిజిటల్ హెల్త్ రికార్డుల సేవల్ని చిత్తూరు జిల్లాకు కూడా విస్తరించారు. తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.

ఇందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లెలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో సంజీవని ప్రాజెక్టును విస్తరించేలా డిజినెర్వ్ సెంటర్ సేవల్ని ప్రారంభించారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో సహా నారావారిపల్లెకు వెళ్లిన సీఎం ఇవాళ స్వగ్రామం సహా తిరుపతిలలో వేర్వేరు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
నారావారిపల్లెలో రూ.4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే స్వగ్రామంలో యువత నైపుణ్యాలు పెంచేలా రూ.1.4 కోట్ల తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. దీంతో పాటు రూ.77 లక్షలతో ఎ.రంగంపేట - భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకూ నిర్మించిన నూతన రహదారిని కూడా సీఎం ప్రారంభించారు.
30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో రూ.45 లక్షలతో నిర్మించిన పేషెంట్ అటెండెంట్ అమినిటీస్ కాంప్లెక్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీవేంకటేశ్వరా యూనివర్సిటీ లో రూ.7.5 కోట్లతో నిర్మించిన యూత్ హాస్టల్, రూ.5 కోట్లతో నిర్మించిన మహిళా హాస్టల్ ను సీఎం ప్రారంభోత్సవం చేశారు.
నీటి తరలింపు ప్రాజెక్టుకు శంకుస్థాపన….
నారావారిపల్లె సమీపంలో రూ.126 కోట్లతో నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్ కు, మూలపల్లి చెరువు సహా మరో 4 చెరువులకు నీటిని తరలించే పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న పశువుల వసతి నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.
ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో కేంద్రీకృత పరిశోధనా ల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5.03 కోట్లతో అకడెమిక్ బిల్డింగ్ 2వ అంతస్తు నిర్మాణానికి, రూ.2.91 కోట్లతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

