అమరావతి రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.260 కోట్లతో ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భూమిపూజ చేశారు. రెండు దశల్లో ఈ పనులు జరగనున్నాయి. దేవతల రాజధాని మాదిరిగానే ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.

'2003లో క్లైంబర్ మెయిన్స్ పెట్టినా నాకు ప్రాణ బిక్ష పెట్టినది వెంకటేశ్వరస్వామి. ఈ ప్రదేశంలో ఏ తప్పు జరగనివ్వను. తప్పు చేస్తే వెంకటేశ్వరుడు వదిలిపెట్టడు. గత ప్రభుత్వం విధ్వంసం చేసింది. అమరావతి రైతులకు నరకం చూపించారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారు.' అని చంద్రబాబు అన్నారు.
రూ.260 కోట్ల పనులను రెండు దశల్లో చేస్తారు. మొదటి దశలో కాంపౌండ్ వాల్, ఏడు అంతస్తుల మహా గోపురం, ఆర్జిత సేవా మండపం, రాధా మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి పనులను నిర్మించడానికి మొత్తం రూ.140 కోట్లు ఖర్చు చేస్తారు.
ఇక రెండో దశలో మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రి నివాసాలు, అర్చకులు మరియు సిబ్బందికి నివాసాలు, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ స్థలాల అభివృద్ధి ఉంటాయి. వీటికి రూ.120 కోట్లు కానున్నాయి.
గతంలో టీటీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019కి ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 25.417 ఎకరాలు కేటాయించింది. రూ.185 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు వేసింది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేటాయించిన భూమిని తగ్గించడం, రూ.36 కోట్లకు కుదించడం చేసింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలయ విస్తరణ, అభివృద్ధిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. గతంలోకంటే మరిన్ని సదుపాయాలు, ఆకట్టుకునే డిజైన్తో ఈ ఆలయాన్ని విస్తరించనున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని, వారాంతాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ అధికారులు, గ్రామస్తులు ప్రతిరోజూ అన్నప్రసాదం నిర్వహిస్తారు. పూర్తి సౌకర్యాలతో అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా స్థాపించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
{{/usCountry}}ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలయ విస్తరణ, అభివృద్ధిని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. గతంలోకంటే మరిన్ని సదుపాయాలు, ఆకట్టుకునే డిజైన్తో ఈ ఆలయాన్ని విస్తరించనున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని, వారాంతాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆలయ అధికారులు, గ్రామస్తులు ప్రతిరోజూ అన్నప్రసాదం నిర్వహిస్తారు. పూర్తి సౌకర్యాలతో అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా స్థాపించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
{{/usCountry}}