...
...
Next Story

ఇంటికో పారిశ్రామిక వేత్త.. ప్రతీ 50 కిలో మీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తాం : సీఎం చంద్రబాబు

ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయంతో కనిగిరిలో 5 వేల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా కనిగిరి త్వరలో కనకపట్నం అవుతుందన్నారు.

Published on: Nov 11, 2025, 13:11:21 IST
Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించారు. వర్చువల్‌గా రాష్ట్రం వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించారు. అంతేకాదు 587 ఎకరాల్లో 35 ప్రభుత్వ, ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు సీఎం.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

మట్టిలో పుట్టిన మాణిక్యాలను సాన పెట్టే బాధ్యతను తాను తీసుకుంటానని, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కనిగిరిలో 5 వేల ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. బ్రహ్మంగారు చెప్పినట్టు కనిగిరి త్వరలోనే కనకపట్నం అవుతుందన్నారు. రిలయన్స్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రవరీస్ ప్లాంట్ ఇక్కడ పెట్టిందన్నారు. అది ఎలా సాధ్యం అయిందో సీఎం చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోపాటుగా స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ది బిజినెస.. ఈ రెండింటితో సాధ్యమైందన్నారు.

'ఈ ఏడాది లక్ష మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతాం. వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులను తయారుచేయాలి. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నాం. రాజధాని కోసం 29 వేల మంది రైతులకు 33 వేల ఎకరాలు ఇచ్చారు. భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రతీ 50 కిలో మీటర్లకు ఒక పోర్టు నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటికే అనేక పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. ఈ వారం పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుందన్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొమ్నారు. కష్టపడి పని చేసే యువత మన రాష్ట్రంలో ఉందన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe