రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పరిపాలనపై దిశానిర్దేశం చేశారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రస్సల్ సిస్టమ్ (PGRS) ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో జాప్యం జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా…. వాటికి శాశ్వత పరిష్కారం చూపినప్పుడే ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని సీఎం పేర్కొన్నారు.
ప్రతి శుక్రవారం 'ఫీల్డ్ గ్రీవియన్స్ డే'

ప్రస్తుతం ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహిస్తున్న గ్రీవియన్స్ డే తరహాలోనే, ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో గ్రీవియన్స్ డే నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిని 'ఫీల్డ్ గ్రీవియన్స్ డే'గా పిలవాలని, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు.
సీఎం చంద్రబాబు ప్రస్తావించిన అంశాలు :
- " పీజీఆర్ఎస్ విధానంలో కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలి. ఇద్దరూ కలిసి కూర్చుని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
- సింగపూర్‌లో ఫిర్యాదుల పరిష్కారం ఏ విధంగా జరుగుతుందో, అదే తరహాలో ఇక్కడ కూడా పకడ్బందీ వ్యవస్థను తీసుకురావాలి. ఇందుకోసం 'ప్రజా దర్బార్' లాంటి వేదికను ఏర్పాటు చేయబోతున్నాం.
- అధికారులు ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని కనీసం నాలుగు సార్లు సందర్శించాలి. సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు ఒక 'గుడ్ విల్ మిషన్' లాగా క్షేత్రస్థాయికి వెళ్లాలి.
- ప్రజల నుంచి తీసుకున్న పిటిషన్లను కేవలం కాగితాలకే పరిమితం చేసి కార్లలో వదిలేయవద్దు. ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి.
- వీడియో కాన్ఫరెన్స్‌ల వల్ల అధికారుల సమయం వృథా కాకుండా ఉండేందుకు, వారంలో కేవలం ఒక రోజును మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం కేటాయించాలి.
- మండల స్థాయిలోనూ గ్రీవియన్స్ విధానాన్ని బలోపేతం చేయడం ద్వారా సామాన్యులకు ప్రభుత్వం మరింత చేరువవుతుంది. ప్రజల నమ్మకాన్ని కాపాడటమే ఈ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం" అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. “కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత టైమ్ వృధా అవుతుందో ఆలోచించండి. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్ లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే... పాలన సులభతరం అవుతుంది. వాట్సాప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా పౌరసేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం... 90 శాతం ప్రభుత్వ సేవలు వాట్సప్ లో అందుబాటులో ఉన్నాయి. డిసెంబరు నాటికి అన్ని సేవల్ని వాట్సప్ లో అందించేలా చూడాలి. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
{{/usCountry}}ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. “కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత టైమ్ వృధా అవుతుందో ఆలోచించండి. ప్రజలకు త్వరితగతిన సేవలు అందిస్తూ.. ఆన్ లైన్ సేవలను పూర్తిగా అందుబాటులోకి తెస్తే ప్రజల సమయం వృధా కాదు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే... పాలన సులభతరం అవుతుంది. వాట్సాప్ గవర్నెన్సు మనమిత్ర ద్వారా పౌరసేవలపై ప్రజలకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే 29 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం... 90 శాతం ప్రభుత్వ సేవలు వాట్సప్ లో అందుబాటులో ఉన్నాయి. డిసెంబరు నాటికి అన్ని సేవల్ని వాట్సప్ లో అందించేలా చూడాలి. మాన్యువల్ టచ్ పాయింట్ల వద్దకు వచ్చే ప్రజలకు వాట్సప్ వినియోగాన్ని వివరించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.
{{/usCountry}}