VB G-RAM-G scheme : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రక ఘట్టానికి తిరుపతి జిల్లా రైల్వేకోడూరు వేదికైంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్’ పథకాన్ని ఏపీ నుంచి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది.

ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనుల్ని ముగ్గురు నేతలూ లాంఛనంగా ప్రారంభించారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు కలిసి వీబీజీ రామ్ జీ జాబ్ కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ లు వీబీ జీ రామ్ జీ ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు.
చారిత్రాత్మక ఘట్టం - సీఎం చంద్రబాబు
ఈ పథకం కింద సమాచార బుక్ లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విడుదల చేశారు. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజివికా మిషన్ పోర్టల్ ను నేతలు ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...." వీబీ జి రామ్ జీ పథకం ఏపీలోని రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావటం చారిత్రాత్మకం. గతంలో నరేగా రాయలసీమ ప్రాంతం నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతం అయ్యింది. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్రం మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో వీబీజీ రామ్ జీ కింద పనులు చేపడతాం" అని చెప్పారు.
జల్ జీవన్ మిషన్ సహా 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత పాలకులు నిర్వీర్యం చేస్తే వాటిని తిరిగి పునరుద్ధరించామని సీఎం అన్నారు. రూ.28 వేల కోట్లతో వివిధ పథకాలు చేపడుతున్నామని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెడతామని చెప్పి రెండేళ్లలో మాట నిలుపుకున్నామని వివరించారు. సీఎం మాట్లాడుతూ “కేంద్రం అమరావతికి సహకారం అందించింది. వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతోంది. ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికలు అయ్యాక మరో మాట మాట్లాడారు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పాట పాడుతున్నారు. ఇది ఎవరికైనా అర్ధం అయ్యిందా. అమరావతిని ఆపటం ఎవరి తరమూ కాదు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం” అని వివరించారు.
ఏపీకి నేను మేనమామ - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
{{/usCountry}}జల్ జీవన్ మిషన్ సహా 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత పాలకులు నిర్వీర్యం చేస్తే వాటిని తిరిగి పునరుద్ధరించామని సీఎం అన్నారు. రూ.28 వేల కోట్లతో వివిధ పథకాలు చేపడుతున్నామని.. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెడతామని చెప్పి రెండేళ్లలో మాట నిలుపుకున్నామని వివరించారు. సీఎం మాట్లాడుతూ “కేంద్రం అమరావతికి సహకారం అందించింది. వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతోంది. ఎన్నికల ముందు ఓ మాట ఎన్నికలు అయ్యాక మరో మాట మాట్లాడారు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పాట పాడుతున్నారు. ఇది ఎవరికైనా అర్ధం అయ్యిందా. అమరావతిని ఆపటం ఎవరి తరమూ కాదు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం” అని వివరించారు.
ఏపీకి నేను మేనమామ - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్
{{/usCountry}}సీఎం చంద్రబాబుతో కలిసి వీబీ జీ రామ్ జీ పథకం ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకే వీబీజీ రామ్ జీ కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. స్వయంగా గ్రామ సభలే పంచాయితీలో పనుల్ని నిర్దేశించుకుంటాయని తెలిపారు. తనను మధ్యప్రదేశ్ లో అంతా మామాజీ అని పిలుస్తారని.. ఇప్పుడు ఏపీకి కూడా తాను మేనమామనే అయ్యానని మంత్రి వ్యాఖ్యానించారు. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడని.. ఏపీకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్ల నిధులు ఇవ్వనున్నట్టు తెలిపారు.