రాష్ట్ర రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురువారం వెంకటపాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచం అంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దటమే తమ ధ్యేయమన్నారు. స్పూర్తిదాత వాజ్ పేయి స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్పూర్తి అని చెప్పుకొచ్చారు.
స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం - సీఎం చంద్రబాబు
“చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నాం. అటల్ మోదీ సుపరిపాలనా యాత్ర బీజేపీ ప్రారంభించింది. 26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్టించేలా కూటమి సంయుక్తంగా పనిచేసింది. అమరావతిలో వాజ్ పేయి విగ్రహంతో పాటు ఆయన చరిత్ర, సుపరిపాలనను ప్రజలకు తెలిసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం” అని సీఎం చంద్రబాబు వివరించారు.
నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రేసతర పార్టీలను ఏకం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. “వాజ్ పేయి ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన ప్రయాణం కూడా అత్యంత కీలకం. మంచి వక్త, కవిగా, ప్రజాహృదయ నేతగా అటల్ బిహారీ వాజ్ పేయి దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశారు. వాజ్ పేయి ప్రతిపాదించిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొట్టమొదట తడ -చెన్నైల మధ్యే ప్రారంభించాం. నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక టెలికామ్ సెక్టార్ ను డీరెగ్యులేషన్ ప్రారంభించి ప్రగతికి పునాది వేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4జీ రివల్యూషన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు” అని ప్రసంగించారు.
“దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి అప్పటి ప్రధాని వాజ్ పేయి. అప్పటి కార్గిల్ యుద్ధంలో వాజ్ పేయి, ఇప్పుడు సింధూర్ లో ప్రధాని మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని చాటారు.దేశం మెచ్చిన నేతగా మాజీ ప్రధాని వాజ్ పేయి చిరస్మరణీయులు. అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎన్టీఆర్ లాంటి నేతల్ని కూడా గుర్తుంచుకునేలా అమరావతిలో స్మారకాన్ని ఏర్పాటు చేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
{{/usCountry}}“దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి అప్పటి ప్రధాని వాజ్ పేయి. అప్పటి కార్గిల్ యుద్ధంలో వాజ్ పేయి, ఇప్పుడు సింధూర్ లో ప్రధాని మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని చాటారు.దేశం మెచ్చిన నేతగా మాజీ ప్రధాని వాజ్ పేయి చిరస్మరణీయులు. అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎన్టీఆర్ లాంటి నేతల్ని కూడా గుర్తుంచుకునేలా అమరావతిలో స్మారకాన్ని ఏర్పాటు చేస్తాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
{{/usCountry}}అమరావతిలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు మరోసారి చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. “గేరు మార్చి పనుల్ని వేగవంతం చేస్తాం.నాడు ప్రధాని హోదాలో హైటెక్ సిటీకి అటల్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటం జోరు. హైవేలు, పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. గత పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. ఇప్పుడు కోలుకుని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టింది” అని చెప్పుకొచ్చారు.
“పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలడ్డుతున్నారు.మెరుగ్గా ప్రాజెక్టు నిర్మితం కావాలంటే పీపీపీ ద్వారానే వేగంగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా ఇదే నిరూపితం అయింది.పీపీపీ పద్దతిలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఆర్ధిక మద్దతు కూడా ఇస్తున్నాం. పీపీపీ అంటే ప్రైవేటు కాదు ప్రభుత్వ ఆస్తే. దానిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తారు.కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు... అలాంటి వ్యక్తుల నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి.వాజ్ పేయి లాంటి ఉన్నత నాయకులతో రాజకీయం చేసి.. ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయటం సిగ్గు అనిపిస్తోంది.ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ అభివృద్ది యాత్ర అగదు. సంపద ఆరోగ్యం, ఆనందం ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.