...
...
Next Story

కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవి.. ప్రయాణికుల కంప్లీట్ లిస్ట్ ఇది!

కర్నూలులో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ట్రావెల్ బస్సు కాలి బూడిదైంది. అయితే వివరాల కోసం అదికారులు కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేశారు.

Published on: Oct 24, 2025, 09:40:00 IST
Advertisement

హైదరాబాద్-బెంగళూరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద కాలి బూడిదైంది. ఇందులో ప్రయాణిస్తున్న చాలా మంది మరణించారు. ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. సురక్షితంగా ఉన్న వారిని గుర్తించామని, ఆసుపత్రిలో వారు చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. బైక్ ఢీకొని మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రధాన డ్రైవర్ కనిపించడం లేదని, మరో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా వివరించారు. డీఎన్‌ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టుగా వెల్లడించారు. ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు.

కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలు బస్సు ప్రమాదం

కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్ : 08518-277305

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ నెంబర్ : 9121101059

ఘటనా స్థలి వద్ద కంట్రోల్ నెంబర్ : 9121101061

కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ నెంబర్ : 9121101075

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు: 9494609814, 9052951010

ప్రయాణికుల పూర్తి లిస్ట్

బస్సులో అశ్విన్ రెడ్డి, జి.ధాత్రి, కీర్తి, పంకజ్, యువన్ శంకర్ రాజు, తరుణ్, ఆకాశ్, గిరిరావు, బున సాయి, గణేశ్, జయంత్ పుష్వాహా, పిల్వామిన్ బేబి, కిశోర్ కుమార్, రమేశ్(అతడి ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా), అనూష, మహ్మద్ ఖైజర్, దీపర్ కుమార్, అన్దోజ్ నవీన్ కుమార్, ప్రశాంత్, ఎం.సత్యనారాయణ, మేఘనాథ్, వేణు గుండ, చరిత్, చందన మంగ, సంధ్యారాణి మంగ, గ్లోరియా ఎల్లెస శ్యామ్, జయసూర్య, హారిక, శ్రీహర్ష, శివ, శ్రీనివాస రెడ్డి, సుప్రహ్మణ్యం, కే.అశోక్, ఎంజీ.రామారెడ్డి, ఉమాపతి, అమృత్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.

‘హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 24వ తేది తెల్లవారుజామున 3 నుంచి 3-10 గంటల సమయంలో బైక్ ను ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ అయి ప్రమాదం జరిగింది. 21 మంది సురక్షితంగా ఉన్నారు. మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించాం. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నాం.’ అని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks