Andhra Pradesh COVID Cases : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ వ్యాప్తి మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా కేసులు నమోదుకావడంతో ఆరోగ్య శాఖ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. ఇందులో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలోనే 8 కేసులున్నాయి.
జిల్లాల వారీగా నమోదైన కేసులు

కడప జిల్లా తర్వాత గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున బయటపడ్డాయి.
ఇప్పటివరకు వైరస్ మరియు ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా నలుగురు మరణించారు. ఇక ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా…. మరో నలుగురు హోం ఐసోలేషన్‌లో ఉంటూ కోలుకుంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన బాధితుల నమూనాలను అధికారులు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) పరిశోధన కేంద్రానికి పంపించారు. ఈ నమూనాలను తీవ్రంగా పరిశీలించిన నిపుణులు…. ఇది 'ఆర్‌ఎఫ్.5' వేరియంట్ అని ఇటీవలనే నిర్ధారించారు. ఇక రాష్ట్రవ్యాప్త పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సర్వైలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది.
'ఆర్‌ఎఫ్.5' కొత్త వేరియంట్ ఏంటి?
వైరస్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవిడ్-2 వైరస్ కాలక్రమంలో పరిణామం చెందుతూ ఒమిక్రాన్‌గా రూపాంతరం చెందింది. ఈ ఒమిక్రాన్ ఉపరకమైన 'జేఎన్.1' నుంచి 'ఎల్‌ఎఫ్.7', 'పీవై.1.1.1' అనే రెండు వేర్వేరు బ్రాంచిలు ఏర్పడ్డాయి. ఈ రెండింటి కలయికతోనే తాజాగా 'ఆర్‌ఎఫ్.5' అనే కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది.
ఈ 'ఆర్‌ఎఫ్.5' వేరియంట్‌ను చూసి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే…. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, ఏడాదిలోపు చిన్న పిల్లలు, గర్భిణులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా ఆర్‌ఎఫ్.5 ప్రధాన లక్షణాలు
- నిరంతర దగ్గు, జలుబు
- గొంతునొప్పి, తలనొప్పి
- తీవ్రమైన ఒళ్లు నొప్పులు
- గ్రేడ్ ఫీవర్ (జ్వరం)
ఈ 'ఆర్‌ఎఫ్.5' వేరియంట్‌ను చూసి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే…. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, ఏడాదిలోపు చిన్న పిల్లలు, గర్భిణులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా ఆర్‌ఎఫ్.5 ప్రధాన లక్షణాలు
- నిరంతర దగ్గు, జలుబు
- గొంతునొప్పి, తలనొప్పి
- తీవ్రమైన ఒళ్లు నొప్పులు
- గ్రేడ్ ఫీవర్ (జ్వరం)
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా కొన్ని నియమాలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఆ వివరాలు ఇలా….
- రద్దీగా ఉండే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
- హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్‌తో చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి.
- కరోనా లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి, వైద్యుల పర్యవేక్షణలో ఉండటం శ్రేయస్కరం.
- పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి లక్షణాలు కనిపిస్తే వెంటనే హోం ఐసోలేషన్‌లో ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
- మూడు నాలుగు రోజుల్లో సమస్య తగ్గకపోతే వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించాలి.