ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(SHAR)లో ప్రతిష్టాత్మక రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ మధ్యాహ్నం 12:17 గంటలకు మెుదలైంది. మొత్తం 22 గంటల పాటు కొనసాగుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు PSLV-C62 రాకెట్ ఉపయోగించి 'అన్వేషణ్' అని నామకరణం చేసిన EOS N1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ మిషన్ ద్వారా ఎనిమిది విదేశీ, ఏడు స్వదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాలలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. 'అన్వేషణ్' ఉపగ్రహం భూమి పరిశీలన కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. రక్షణ రంగానికి అవసరమైన డేటాను అందించడం, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి ముందస్తు హెచ్చరికలను అందించడం ద్వారా జాతీయ భద్రత, విపత్తు నిర్వహణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
సకాలంలో సమాచారం అందించడం వల్ల ఇటువంటి సంఘటనల సమయంలో ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇస్రో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జనవరి 12న ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి PSLV-C62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు వీక్షించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ప్రయోగానికి ముందుగానే షార్, దాని చుట్టుపక్కల విస్తృత భద్రతా చర్యలు అమలు చేశారు. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియ ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. PSLV-C62 ద్వారా EOS N1 (అన్వేషణ్) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం భారత అంతరిక్ష కార్యక్రమానికి గర్వకారణంగా అని చెబుతున్నారు. ఇది జాతీయ రక్షణ, వాతావరణ అధ్యయనాలు, విపత్తు నిర్వహణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్, శాస్త్రవేత్తలు ఇప్పటికే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ముక్కంటి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాల్లోనూ పూజలు చేశారు. రాకెట్, ఉపగ్రహ నమూనాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు.
{{/usCountry}}ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్, శాస్త్రవేత్తలు ఇప్పటికే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ముక్కంటి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాల్లోనూ పూజలు చేశారు. రాకెట్, ఉపగ్రహ నమూనాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు.
{{/usCountry}}