అర్నబ్ తుపాన్ మూలంగా ఆస్తి, పంట నష్టాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తుపాన్ పరిస్థితిపై నిరంతర సమీక్షలు నిర్వహించామని, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతిచెందిన వారి కుటుంబాలకు రూ5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు అన్నారు. షెల్టర్ క్యాంపుల్లో ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికీ రూ.1,000 అందించనున్నారు. ముంపునకు గురై ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రాంతాల ప్రజలకు 25 కేజీల బియ్యం పంపిణీ చేస్తారని ప్రకటించారు. చేనేత కార్మికులు, మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యంతో పాటు కేజీ చొప్పున కందిపప్పు, వంటనూనె, ఉల్లిపాయలు ఉచితంగా అందిస్తామన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టం ఆధారంగా పరిహారం ఖరారు చేశారు:
వరి, ఇతర సాధారణ పంటలు: రూ.15,000 నుంచి రూ.25,000 వరకు.
పత్తి, చెరకు: రూ.25,000.
అరటి, పసుపు: రూ.35,000.
తమలపాకుల తోటలు: రూ.75,000.
మిరప, బొప్పాయి, టమాటా, ఉల్లి: రూ.25,000 నుంచి రూ.35,000 వరకు.
మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, జీడిమామిడి: రూ.35,000.
కాఫీ, డ్రాగన్ ఫ్రూట్: రూ.35,000.
కూరగాయలు, పుచ్చకాయలు, నర్సరీలు: రూ.25,000.
ఆయిల్ పామ్, కొబ్బరి చెట్లు: ఒక్కో చెట్టుకు రూ.15,000.
పశుసంపద, కోళ్ల పెంపకందారులకు పరిహారం,
ఆవు మృతికి: రూ.50,000
గేదె మృతికి: రూ.40,000
దూడ మృతికి: రూ.25,000
{{/usCountry}}దూడ మృతికి: రూ.25,000
{{/usCountry}}గొర్రె / మేక మృతికి: రూ.7,500
కోళ్లు మృతికి: ఒక్కో దానికి రూ.100 చొప్పున (గరిష్ఠంగా లబ్ధిదారునికి రూ.10,000 వరకు).
క్యాటరింగ్ షెడ్లకు: రూ.5,000 | బ్యాటరీ షెడ్లకు: రూ.500.
మత్స్యకారులు, ఆస్తుల పునరుద్ధరణ పరిహారం.
వలల మరమ్మతులకు: రూ.5,000, కొత్త వలల కొనుగోలుకు: రూ.10,000.
మోటారు లేని పడవలకు (వలలతో సహా): రూ.27,000.
ఫిషింగ్ బోట్లు, వలలు దెబ్బతింటే: రూ.25,000.
చేపల చెరువుల పునరుద్ధరణకు: రూ.17,000.
దెబ్బతిన్న షెడ్లకు: రూ.25,000.
పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు: రూ.10,000.
చిన్న దుకాణాలకు: రూ.25,000.
చేనేత కళాకారులకు : రూ.25,000.
తోపుడు బండ్లు: రూ.20,000.
త్రీ వీలర్స్ (ఆటోలు మొదలైనవి): రూ.10,000.
ద్విచక్ర వాహనాలు : రూ.3,000.
MSMEలకు కేటగిరీల ఆధారంగా వర్గీకరించి సాయం అందజేస్తారు.
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలు నెమ్మదించాయని, మిగిలిన అన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రానికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నామని సీఎం చెప్పారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల ప్రజలు గురువారం సాయంత్రం వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో అధికారులు పూర్తి పారదర్శకత వహించాలని ఆదేశించారు.