బంగాళాఖాతంలో తుపాను కారణంగా అంతర్వేది సమీపంలో సముద్రంలో నౌక చిక్కుకుంది. విశాఖ నుంచి సింగపూర్ వెళ్తున్న నౌకగా గుర్తించారు. ఈ మర్చంట్ షిప్లో చిక్కుకున్న వారిని హెలీకాప్టర్ ద్వారా రక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆపరేషన్ చర్యలు ముమ్మరం చేసింది.

ఇప్పటికే 13 మందిని ఇండియన్ కోస్టు గార్డ్ షిప్ SUJAY లోకి సురక్షితంగా చేర్చారు కోస్టు గార్డ్ అధికారులు. ఇంకా నౌకలోనే మరో ఏడుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది.
మిగిలిన సిబ్బందిని తరలించేందుకు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను మోహరించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పదమూడు మందిని కోస్ట్ గార్డ్ నౌక సుజయ్కు సురక్షితంగా తరలించగా , మరో ఏడుగురు వాణిజ్య నౌకలోనే ఉన్నారు.
సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ
అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అమరావతి నుంచి కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చేరుకున్నారు. మార్గం మధ్యలో ఏరియల్ వ్యూ ద్వారా అర్నబ్ తుపాన్ వల్ల నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో తుపాన్ ప్రభావాన్ని పరిశీలించారు.
నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను, కూలిన కొబ్బరి చెట్లను చంద్రబాబు పరిశీలించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాలను ముఖ్యమంత్రికి సెక్రటరీ ప్రద్యుమ్న వివరించారు.
మరోవైపు అంతకుముందు క్షేత్రస్థాయిలో సాధారణ పరిస్థితి నెలకొనేంత వరకు విశ్రమించొద్దని ఇప్పటికే అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు సూచించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని క్షేత్ర స్థాయి పరిస్థితులు, పునరుద్దరణ పనులపై వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించారు. తుపాన్ నష్టంపై ప్రాథమిక నివేదికను అందిస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
పంట నష్టం మినహా బాధితులందరికీ నష్టపరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలన్నారు సీఎం. 'ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాలి. అర్నబ్ తుపాన్ సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసింది. ఏపీలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు. మిగిలిన ప్రాంతాల్లో అర్నబ్ తుపాన్ వల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఈ రెండింటి విషయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలి. రాయలసీమలో పంటలు వేసుకునే పరిస్థితి లేదు.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}పంట నష్టం మినహా బాధితులందరికీ నష్టపరిహారాన్ని అందించే పనిని వేగవంతం చేయాలన్నారు సీఎం. 'ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాలి. అర్నబ్ తుపాన్ సమయంలో అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేసింది. ఏపీలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందులు. మిగిలిన ప్రాంతాల్లో అర్నబ్ తుపాన్ వల్ల సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. ఈ రెండింటి విషయంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించి ప్రజలను ఆదుకోవాలి. రాయలసీమలో పంటలు వేసుకునే పరిస్థితి లేదు.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}'ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి జిల్లాల్లో వేసుకున్న పంటలను, కొబ్బరి చెట్లను నష్టపోయిన దుస్థితి. పక్కా ప్రణాళికతో ఈ ప్రకృతి విపత్తుల బారీ నుంచి ప్రజలను బయటపడేయాలి. అర్నబ్ తుపాన్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వీలైనంత మేర తగ్గించేలా చూశాం. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పడిపోయిన చెట్లను ఇప్పటికే చాలా వరకు తొలగించాం. రేపటిలోగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలి.' అని చంద్రబాబు అన్నారు.