అర్నబ్ తుపాను నష్టపరిహారం.. టూ వీలర్‌కు రూ.3వేలు.. మిగిలిన వివరాలు చూడండి!

Cyclone Arnab compensation : అర్నబ్ తుపాను కారణంగా పంట, ఆస్తి నష్టపోయిన అందరికీ న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తీవ్రతను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.

Published on: Oct 28, 2026, 21:26:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

అర్నబ్‌ తుపాన్ మూలంగా ఆస్తి, పంట నష్టాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా తుపాన్ పరిస్థితిపై నిరంతర సమీక్షలు నిర్వహించామని, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల పెద్ద ఎత్తున ప్రాణనష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ఈ విపత్తులో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అర్నబ్ తుపాను
అర్నబ్ తుపాను

మృతిచెందిన వారి కుటుంబాలకు రూ5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు అన్నారు. షెల్టర్ క్యాంపుల్లో ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికీ రూ.1,000 అందించనున్నారు. ముంపునకు గురై ఇళ్లల్లోకి నీరు చేరిన ప్రాంతాల ప్రజలకు 25 కేజీల బియ్యం పంపిణీ చేస్తారని ప్రకటించారు. చేనేత కార్మికులు, మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యంతో పాటు కేజీ చొప్పున కందిపప్పు, వంటనూనె, ఉల్లిపాయలు ఉచితంగా అందిస్తామన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టం ఆధారంగా పరిహారం ఖరారు చేశారు:

వరి, ఇతర సాధారణ పంటలు: రూ.15,000 నుంచి రూ.25,000 వరకు.

పత్తి, చెరకు: రూ.25,000.

అరటి, పసుపు: రూ.35,000.

తమలపాకుల తోటలు: రూ.75,000.

మిరప, బొప్పాయి, టమాటా, ఉల్లి: రూ.25,000 నుంచి రూ.35,000 వరకు.

మామిడి, నిమ్మ, దానిమ్మ, సపోటా, జీడిమామిడి: రూ.35,000.

కాఫీ, డ్రాగన్ ఫ్రూట్: రూ.35,000.

కూరగాయలు, పుచ్చకాయలు, నర్సరీలు: రూ.25,000.

ఆయిల్ పామ్, కొబ్బరి చెట్లు: ఒక్కో చెట్టుకు రూ.15,000.

పశుసంపద, కోళ్ల పెంపకందారులకు పరిహారం,

ఆవు మృతికి: రూ.50,000

గేదె మృతికి: రూ.40,000

దూడ మృతికి: రూ.25,000

గొర్రె / మేక మృతికి: రూ.7,500

కోళ్లు మృతికి: ఒక్కో దానికి రూ.100 చొప్పున (గరిష్ఠంగా లబ్ధిదారునికి రూ.10,000 వరకు).

క్యాటరింగ్ షెడ్లకు: రూ.5,000 | బ్యాటరీ షెడ్లకు: రూ.500.

మత్స్యకారులు, ఆస్తుల పునరుద్ధరణ పరిహారం.

వలల మరమ్మతులకు: రూ.5,000, కొత్త వలల కొనుగోలుకు: రూ.10,000.

మోటారు లేని పడవలకు (వలలతో సహా): రూ.27,000.

ఫిషింగ్ బోట్లు, వలలు దెబ్బతింటే: రూ.25,000.

చేపల చెరువుల పునరుద్ధరణకు: రూ.17,000.

దెబ్బతిన్న షెడ్లకు: రూ.25,000.

పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు: రూ.10,000.

చిన్న దుకాణాలకు: రూ.25,000.

చేనేత కళాకారులకు : రూ.25,000.

తోపుడు బండ్లు: రూ.20,000.

త్రీ వీలర్స్ (ఆటోలు మొదలైనవి): రూ.10,000.

ద్విచక్ర వాహనాలు : రూ.3,000.

MSMEలకు కేటగిరీల ఆధారంగా వర్గీకరించి సాయం అందజేస్తారు.

కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలు నెమ్మదించాయని, మిగిలిన అన్ని జిల్లాల్లో బుధవారం సాయంత్రానికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నామని సీఎం చెప్పారు. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల ప్రజలు గురువారం సాయంత్రం వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో అధికారులు పూర్తి పారదర్శకత వహించాలని ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More