తీవ్రమైన తుపానుగా మారిన మొంథ అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా. భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మెుంథా తుపాను గురించి తెలుసుకోవాల్సి 10 విషయాలు చూద్దాం..
- ఈరోజు తీరం దాటే అవకాశం: మెుంథా తుపాను అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి ఆంధ్రప్రదేశ్ తీరంలో కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కాకినాడ మధ్యం తీరం దాటనుంది.
- తీవ్రమైన తుపాను : IMD ప్రకారం, తుఫాను అక్టోబర్ 28న ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
- భారీ వర్ష హెచ్చరిక: కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే వర్షాలు ముదలు అయ్యాయి. రేపటి వరకు అతి భారీ వర్షాలు పడనున్నాయి.
- తుపాను హెచ్చరిక: సముద్రంలో అలల 1 మీటరు కంటే ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఉప్పెన వచ్చే అవకాశం ఉంది, దీని వలన ఆంధ్రప్రదేశ్ తీరం, యానాం ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు వరదలకు గురవుతాయి.
- పునరావాస కేంద్రాలు : అధికారులు లోతట్టు తీర ప్రాంతాల నుండి నివాసితులను తరలిస్తున్నారు. దాదాపు 50,000 మంది వ్యక్తులను సహాయ శిబిరాలకు తరలించారు. 2194 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.
- పాఠశాలలకు సెలవు : ముందు జాగ్రత్త చర్యగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో కాలేజీ, పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు.
- రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కోనసీమ వంటి అనేక జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్‌లు జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.
- ఇతర రాష్ట్రాలపై ప్రభావం : ఒడిశా, తమిళనాడు, తెలంగాణ కూడా తుపాను ప్రభావాన్ని చూస్తున్నాయి. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
- విమానాలు, రైళ్లు రద్దు : మెుంథా తుపాను కారణంగా ఏపీకి రావాల్సిన 18 విమానాలు రద్దు చేశారు. తుపాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మంగళ, బుధవారాల్లో 107 రైళ్లను రద్దు చేసింది.
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైనప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం సహాయం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు.

{{^htLoading}} {{/htLoading}}
తుపాను ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడం, సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి వివిధ చర్యలను ప్రారంభించింది. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, తీరప్రాంత నివాసితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}