మెుంథా తుపాను తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి : సీఎం చంద్రబాబు

మొంథా తుపానుపై అధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Published on: Oct 26, 2025, 15:37:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మొంథా తుపాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంత జిల్లాలలో మోహరించాయి. తుపాన్‌పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

‘మెుంథా తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం చేశాం. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి ప్రత్యేక అధికారులను నియమించాం. విద్యుత్, తాగునీరు, రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించాను.’ అని చంద్రబాబు అన్నారు.

వర్షం తీవ్రతను, తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు కూడా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం.

రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో 27 వేల సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామన్నారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాతీయ రహదారులపై వాహనాలను సిద్ధం చేసినట్టుగా వెల్లడించారు.

‘రాష్ట్ర వ్యాప్తంగా జేసీబీలు, క్రేన్లు అందుబాటులో పెట్టాం. ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వం యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి. తుపాను తీవ్రతను ఆధారంగా చేసుకుని విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించాలి. డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పర్యవేక్షించాలి.’ అని చంద్రబాబు ఆదేశించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More