తీవ్ర తుఫాన్ 'మురసు' సృష్టించిన భీభత్సం ఆంధ్రప్రదేశ్ తీరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తుఫాన్ తీవ్రతకు సముద్రంలో చెలరేగిన అలల ధాటికి బోటు బోల్తా పడి తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం.... తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు మురసు తుఫాన్ నేపథ్యంలో తమ బోట్లతో ఆంధ్రప్రదేశ్ రేవులకు చేరుకుని ఆశ్రయం పొందారు. నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు వద్ద మురాసు తుఫాన్ తీరం దాటిన సంగతి తెలిసిందే. ముందస్తు జాగ్రత్తగా రామాయపట్నం వద్ద మూడు, నిజాంపట్నంలో ఒక బోటును లంగరు వేశారు.
అయితే, నవంబర్ 3న నిజాంపట్నంలో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులు రెండు రాష్ట్రాల అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, రామాయపట్నం వద్ద ఉన్న తమ సహచరులను కలిసేందుకు సముద్రంలోకి ప్రయాణమయ్యారు. ఆ సమయంలో వీచిన ఈదురుగాలులు, ఎగసిపడిన అలల ధాటికి వారి బోటు సముద్రంలో బోల్తా పడింది.
మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు
గత మూడు రోజులుగా అధికారులు చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా, ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరానికి ఆ బోటు కొట్టుకొచ్చినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గురువారం నాడు ఐదు మృతదేహాలను… శుక్రవారం(ఇవాళ) మరో రెండు మృతదేహాలను సముద్రం నుంచి వెలికితీశారు. ఇంకా ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదు.
మృతుల కుటుంబాలకు లోతైన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి… సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, స్థానిక మత్స్యకారులు మరియు సంబంధిత రెస్క్యూ బృందాలు సమన్వయంతో పనిచేసి గల్లంతైన మిగిలిన ఇద్దరినీ త్వరగా గుర్తించాలని స్పష్టం చేశారు.
{{/usCountry}}మృతుల కుటుంబాలకు లోతైన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి… సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, స్థానిక మత్స్యకారులు మరియు సంబంధిత రెస్క్యూ బృందాలు సమన్వయంతో పనిచేసి గల్లంతైన మిగిలిన ఇద్దరినీ త్వరగా గుర్తించాలని స్పష్టం చేశారు.
{{/usCountry}}తీసిన మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం పూర్తి చేసి…. వారి గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మృతులంతా తమిళనాడుకు చెందినవారు కావడంతో…. ఆ రాష్ట్ర అధికారులతో వెంటనే సంప్రదింపులు జరిపి భౌతికకాయాలను వారి సొంత ఊళ్లకు సురక్షితంగా తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.