Andhra Pradesh Cyclone Alert : వాతావరణశాఖ బిగ్ అలర్ట్ - ఆంధ్రప్రదేశ్ వైపు మరో తుఫాన్..!

Andhra Pradesh Cyclone Alert : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వేగంగా బలపడుతోంది. రాబోయే 6 గంటల్లో వాయుగుండంగా, ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారనుంది. సోమవారం నాటికి ఏపీ తీరానికి చేరనుండటంతో హెచ్చరికలు జారీ చేశారు.

Published on: Oct 31, 2026, 14:02:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Andhra Pradesh Cyclone Alert : ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం అత్యంత వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాబోయే 6 గంటల వ్యవధిలోనే పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత మరింత తీవ్రరూపం దాల్చి… ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారనుందని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ వైపు మరో తుపాన్
ఆంధ్రప్రదేశ్ వైపు మరో తుపాన్

సోమవారం నాటికి తీరం సమీపంలోకి..

ఈ తుఫాన్ సోమవారం సాయంత్రానికి పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం వల్ల సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారనుంది. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రా (మధ్య కోస్తా), రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. తుపాను తీరం సమీపానికి వచ్చే సమయంలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.

మత్స్యకారులకు హెచ్చరికలు…

పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని కఠినంగా ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే సమీప తీరాలకు తిరిగి రావాలని సూచించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున అవసరమైతే అధికారులు ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని సూచించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More