ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 2026లో వాహన రిజిస్ట్రేషన్లు, గత ఏడాదితో పోలిస్తే 6.32 శాతం తగ్గాయి. సాధారణంగా వాహనాలను కొనుగోలు చేయడానికి అత్యంత శుభప్రదమైన సమయంగా భావించే దసరా పండుగ సీజన్‌లో, వాహనాల కొనుగోళ్లు మందగించాయని అర్థమవుతోంది.

అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. దీనికి భిన్నంగా జనవరి నుండి సెప్టెంబర్ వరకు నమోదైన వాహనాల సంఖ్య, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. రిజిస్ట్రేషన్లలో తగ్గుదల ఉన్నప్పటికీ, వీటిద్వారా రవాణా శాఖకు వచ్చే ఆదాయం మాత్రం స్వల్పంగా పెరిగి రూ. 616.39 కోట్ల నుండి రూ. 616.89 కోట్లకు చేరుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లలో 29.75 శాతం వృద్ధి, లైఫ్ టాక్స్ వసూళ్ల కారణంగా రవాణా శాఖ ఆదాయం 17.3 శాతం పెరిగి రూ. 3,306.85 కోట్లకు చేరుకుంది.
రోడ్డు రవాణా శాఖ గణాంకాల ప్రకారం అక్టోబర్ 2025లో 1,55,017 వాహనాలు రిజిస్టర్ కాగా, అక్టోబర్ 2026లో 1,45,226 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఆరు శాతానికి పైగా తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత వాహనాల విభాగంలో ఈ తగ్గుదల స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో 8.94 శాతం క్షీణత నమోదైంది.
ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 9.75 శాతం తగ్గగా, కార్ల రిజిస్ట్రేషన్లలో స్వల్పంగా 1.28 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు మొత్తం 6,71,529 వాహనాలు రిజిస్టర్ కాగా 2025లో ఇదే కాలానికి 9,89,560 వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రిజిస్ట్రేషన్లలో ఈ తగ్గుదలకు ప్రధాన కారణం పండుగల క్యాలెండర్‌లో వచ్చిన మార్పులే. 2025లో దసరా, దీపావళి రెండూ అక్టోబర్ నెలలోనే రావడంతో, ఆ సమయంలో వాహనాల కొనుగోళ్లు అధికంగా జరిగాయి. కానీ ఈసారి పండుగల తేదీల్లో మార్పులు వచ్చాయి. అందుకే కొనుగోళ్లలో తేడా వచ్చిందని నిపుణులు అంటున్నారు.
ABOUT THE AUTHOR
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.