హైదరాబాద్‌లో ఈ నాలుగు ఫ్లైఓవర్లపై ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ.. ఎన్ని రోజులు?

Hyderabad Traffic : హైదరాబాద్‌లో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా పలు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రకటించారు.

Published on: Mar 16, 2026, 10:24:44 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'షబ్-ఎ-ఖదర్' (జాగ్నే కీ రాత్) సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ఆంక్షలు విధిచారు. మార్చి 16, 17 తేదీలలో రాత్రి 10:00 గంటల తర్వాత హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లైఓవర్లపై ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఏ ఫ్లైవర్లపై ఆంక్షలు ఉన్నాయో చూడండి.

హైదరాబాద్‌లో నాలుగు ఫ్లైఓవర్లపై ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ
హైదరాబాద్‌లో నాలుగు ఫ్లైఓవర్లపై ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ
  • జూ పార్క్-ఆరామ్‌ఘర్ మధ్య ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్
  • దేవి బాగ్-జూ పార్క్ గేట్ నం. 2 మధ్య ఉన్న బహదూర్‌పురా ఫ్లైఓవర్
  • హషమాబాద్‌లోని నయారా పెట్రోల్ పంప్ నుండి ఫూల్‌బాగ్ DLRL వరకు ఉన్న చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్
  • పిసల్‌బండ, లక్ష్మారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ మధ్య ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్లపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

రాత్రి వేళల్లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున, రహదారి భద్రతను కోసం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేదా ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏవైనా అసౌకర్యాలు కలిగితే, వాహనదారులు 9010203626 నంబర్ ద్వారా ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. మార్చి 16, 17వ తేదీల్లో రాత్రి 10 గంటల తర్వాత కొన్ని ఫ్లైఓవర్లపై బైక్‌లను అనుమతించమని.. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటనలో తెలిపారు.

షబ్-ఎ-ఖదర్

షబ్-ఎ-ఖదర్‌ను లైలతుల్ ఖదర్ అని కూడా అంటారు. పవిత్రమైన రంజాన్ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన రాత్రిగా భావిస్తారు. ఇది వెయ్యి నెలల కంటే ఉత్తమమైన రాత్రిగా ముస్లింలకు నమ్మకం. రంజాన్‌ మాసంలో 27వ రాత్రి వచ్చే షబ్‌ ఏ ఖద్ర్‌ రోజునే పవిత్ర దివ్యఖురాన్‌ అవతరించిందని నమ్ముతారు. రంజాన్ చివరి పది రోజులలో, ముఖ్యంగా 27వ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో ఆధ్యాత్మికంగా జరుపుకొంటారు.

షబ్‌ అంటే రాత్రి, ఖద్ర్‌ అంటే ఉన్నతమైన అని అర్థం ఉంది. ఈ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు ముస్లింలు. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. తరావీహ్‌ నమాజ్‌, బయాన్‌, హదీస్‌, ఖురాన్‌ తిలావత్‌, సలాతుజ్‌, తజ్బీ, తహజ్జుద్‌ నమాజ్‌, దువా ఇలా రాత్రి మెుత్తం.. అల్లా ఆరాధనలోనే ఉంటారు. తోబా, అస్తగ్‌ఫిరుల్లా చదివి తప్పుల నుంచి క్షమాపణ కోరి, నరకం, నరకాగ్ని నుంచి ముక్తి కోరుకుంటారు. ఈ పర్వదినం రోజున.. వెయ్యి నెలలకుపైగా ప్రార్థనలు చేసిన పుణ్యం లభిస్తుందని చెబుతారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More