రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సాయంత్రం 4 గంటలకే ఆఫీస్ నుంచి ఇంటికి

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. సాయంత్రం 4 గంటలకే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తోంది.

Published on: Feb 17, 2026, 20:03:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉపవాస మాసంలో సాయంత్రం 4 గంటలలోపు కార్యాలయం నుండి ఇంటికి వెళ్లడానికి అనుమతి ఉందని ప్రకటించింది.

రంజాన్ మాసం (Unsplash)
రంజాన్ మాసం (Unsplash)

జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(GAD) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారు తమ ఉపవాసం విరమించడానికి, మతపరమైన ప్రార్థనలు చేయడానికి త్వరగా కార్యాలయాన్ని వదిలి వెళ్ళవచ్చు. అయితే అత్యవసర పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటల తర్వాత కూడా పని చేయాల్సి రావచ్చు.

ఈ మేరకు పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులు 4 గంటలకే పని నుండి బయలుదేరడానికి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వెసులుబాటు ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న అందరు ముస్లిం ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉపవాస మాసంలో ఉద్యోగులు మతపరమైన ఆచారాలను పాటించడంలో సహాయపడటానికి ఈ వెసులుబాటు కల్పిస్తోంది ప్రభుత్వం.

రంజాన్ మాసం ప్రారంభం అనేది ఆకాశంలో నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ ఏడాది భారత్‌లో ఫిబ్రవరి 18 లేదా 19 నుంచి ఉపవాస దీక్షలు మొదలుకానున్నాయి. సాధారణంగా సౌదీ అరేబియాలో నెలవంక కనిపించిన మరుసటి రోజున భారత్‌లో రంజాన్ ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది.

ఇస్లాం ప్రకారం అందరూ ఉపవాసం ఉండాలని నియమం ఉన్నప్పటికీ, కొందరికి మినహాయింపులు ఉన్నాయి. అనారోగ్యంతో ఉన్నవారు, ప్రయాణాల్లో ఉన్నవారు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. అయితే వారు కోలుకున్నాక లేదా ప్రయాణం ముగిశాక తప్పిపోయిన రోజులకు బదులుగా మరే రోజైనా ఉపవాసం ఉండాల్సి ఉంటుంది.

31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో

పవిత్రమైన రంజాన్ మాసం ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చింది. అయితే సుమారు 31 ఏళ్ల తర్వాత రంజాన్ మాసం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది. గతంలో 1995లో ఫిబ్రవరి ఒకటో తేదీన రంజాన్ మాసం ప్రారంభమైంది. మళ్లీ 2026లో ఫిబ్రవరి నెలలో మెుదలైంది.

ఇస్లాం క్యాలెండర్ ప్రకారం.. రంజాన్ నెలవంక దర్శనం తర్వాత ప్రారంభం అవుతుంది. మత విశ్వాసాల ప్రకారం.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించాలి. వీటిని మూడు అష్రాలుగా విభజించారు. మెుదటి పది రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్, రెండో 10 రోజుల కాలాన్ని బర్కత్, చివరి 10 రోజుల ఉపవాసాన్ని మగ్ఫిరత్ అంటారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More