Stocks to buy : ఫిబ్రవరి 17- ట్రేడర్లు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్..
ఫిబ్రవరి 17, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగి 83,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 212 పాయింట్లు వృద్ధిచెంది 25,683 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 762 పాయింట్లు పెరిగి 60,949 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 972.13 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,666.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 2,345.69 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,442.93 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ చార్ట్‌లో లాంగ్ బుల్ క్యాండిల్ ఏర్పడింది. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ పాటర్న్లా ఉంది. ఇది సానుకూల సంకేతం. ఇది బుల్స్ ఎంట్రీని సూచిస్తోంది. 25,550 వద్ద నిఫ్టీ50కి కీలక సపోర్ట్ ఉంది. 25,700 వద్ద ఉన్న రెసిస్టెన్స్‌ని దాటితే సూచీ 26,000 వరకు వెళ్లొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
ప్రెసిడెంట్స్ డే సందర్భంగా సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లకు సెలవు. కాగా యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ మాత్రం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
మరోవైపు ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
బంగారం, వెండి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం స్పాట్ గోల్డ్ 0.43శాతం పడి ఔన్సుకు 4,992 డాలర్లకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ ఏకంగా 3శాతం పతనమై ఔన్సుకు 74.24 డాలర్లకు వెళ్లింది.
స్టాక్స్ టు బై..
బంధన్ బ్యాంక్- బై రూ. 167.9, స్టాప్ లాస్ రూ. 162, టార్గెట్ రూ. 180
టాటా స్టీల్- బై రూ. 205.81, స్టాప్ లాస్ రూ. 198, టార్గెట్ రూ. 220
కెనరా బ్యాంక్- బై రూ. 146, స్టాప్ లాస్ రూ. 142, టార్గెట్ రూ. 154
బీడీఎల్- బై రూ. 1250, స్టాప్ లాస్ రూ. 1230, టార్గెట్ రూ. 1330
కోల్ ఇండియా- బై రూ. 422, స్టాప్ లాస్ రూ. 410, టార్గెట్ రూ. 440
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


