స్టాక్​ మార్కెట్​లో 'స్వింగ్​ ట్రేడింగ్​' అంటే ఏంటి? ఎలా చేయాలి?

స్టాక్​ మార్కెట్​లో 'స్వింగ్​ ట్రేడింగ్​' అంటే ఏంటి? ఇంట్రాడే ట్రేడింగ్​కి స్వింగ్​ ట్రేడింగ్​కి మధ్య తేడా ఏంటి? అసలు స్వింగ్​ ట్రేడింగ్​ ఎలా చేయాలి? ఎవరికి ఇది సూట్​ అవుతుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 27, 2025 12:20 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ మధ్య కాలంలో స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​ని సెకెండ్​ ఇన్​కమ్​ సోర్స్​గా మార్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ.. 9-5 ఉద్యోగాలతో మార్కెట్​లను ట్రాక్​ చేయడం కష్టం అవుతుంటుంది. అయితే రెగ్యులర్​ జాబ్​ చేస్తూనే.. మీరు స్టాక్​ మార్కెట్​లో ట్రేడ్​ చేయొచ్చు! ‘స్వింగ్​ ట్రేడింగ్​’తో ఇది సాధ్యమవుతుంది. అసలేంటి ఈ స్వింగ్​ ట్రేడింగ్​? ఎలా చేయాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్వింగ్​ ట్రేడింగ్​ అంటే ఏంటి?
స్వింగ్​ ట్రేడింగ్​ అంటే ఏంటి?

స్వింగ్​ ట్రేడింగ్​ అంటే ఏంటి?

సాధారణంగా స్టాక్​ మార్కెట్​ అంటే రిస్కీ. స్టాక్స్​​ అనేవి ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. స్టాక్​ ప్రైజ్​లు పైకి, కిందకి కదులుతూ ఉంటాయి. స్టాక్​ మూమెంట్​ని, ట్రెండ్​ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్​ ట్రేడింగ్​'!

సాధారణంగా స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​ గురించి ఎక్కువ వింటూ ఉంటారు. ఒక్కరోజులో ట్రేడ్​ని క్లేజ్​ చేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్​ అంటారు. ఇందులో ట్రేడ్​ తదుపరి రోజుకు క్యారీ అవ్వదు. కానీ స్వింగ్​ ట్రేడ్​ అనేది ఇందుకు భిన్నం! స్టాక్స్​ని డెలివరీ తీసుకుని రెండు రోజుల నుంచి 2,3 వారాల వరకు హోల్డ్​ చేయడాన్ని స్వింగ్​ ట్రేడింగ్​గా పరిగణిస్తారు.

స్వింగ్​ ట్రేడింగ్​ కీలకం ‘టైమ్​ఫ్రేమ్​’. ఇంట్రాడే​ ట్రేడింగ్​లో 30నిమిషాలు, 15నిమిషాలు, 5నిమిషాల టైమ్​ ఫ్రేమ్​ని చూస్తారు. కానీ స్వింగ్​ ట్రేడింగ్​లో సాధారణంగా 1 గంట, 4గంటలు, ఒక రోజు టైమ్​ఫ్రేమ్​లను చూస్తుంటారు.

వాస్తవానికి ఎంత తక్కువ టైమ్​ ఫ్రేమ్​ ఉంటే అంత ఎక్కువ రిస్క్​ తీసుకుంటున్నట్టు! ఈ లెక్కన చూసుకుంటే, స్వింగ్​ ట్రేడింగ్​లో కూడా రిస్క్​ ఉన్నప్పటికీ, ఇంట్రాడే ట్రేడింగ్​తో పోల్చుకుంటే కాస్త తక్కువ అని చెప్పుకోవచ్చు.

స్వింగ్​ ట్రేడింగ్​ ఎవరి కోసం?

ఇంట్రాడే ట్రేడింగ్​ అనేది చాలా ఫోకస్డ్​తో చేయాలి. ప్రతి రోజు స్టాక్స్​ని ట్రాక్​ చేయాలి. 9-5 ఉద్యోగాలు చేసేవారికి ఇది సాధ్యం కాదు. వారు ఆఫీస్​ నుంచి ఇళ్లకు వెళ్లేసరికి స్టాక్​ మార్కెట్ క్లోజ్​ అయిపోతుంది. అలాంటి వారికి 'స్వింగ్​ ట్రేడింగ్​' అనేది బెస్ట్​ ఆప్షన్​ అవుతుందని స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతున్నారు.

స్వింగ్​ ట్రేడింగ్​లో మన స్ట్రాటజీని బట్టి స్టాక్​లో ఎంట్రీ, ఎగ్జిట్​, స్టాప్​లాస్​ని ముందే ప్లాన్​ చేసుకోవచ్చు. మనం ఆఫీసులో ఉన్నా, అనుకున్న ఎంట్రీ దగ్గర స్టాక్​ని బై చేయవచ్చు. ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని బ్రోకరేజ్​ సంస్థలు జీటీటీ (గుట్​ టిల్​ ట్రేడ్​) ఆప్షన్​ని ఇస్తున్నాయి. దీని ప్రకారం.. ఒక స్టాక్​ని ఎంతలో కొనాలి? ఎన్ని కొనాలి? వంటి వాటితో ముందే ఆర్డర్​ క్రియేట్​ చేసుకోవచ్చు. స్టాక్​ ప్రైజ్​ మనం బై ప్రైజ్​ దగ్గరికి వెళ్లిన తర్వాత, ఆర్డర్​ ఆటోమెటిక్​గా ట్రిగ్గర్​ అవుతుంది. మీ స్టాక్​ బై అవుతుంది.

అసలు స్వింగ్​ ట్రేడింగ్​ ఎలా చేయాలి?

స్వింగ్​ ట్రేడింగ్​ చేయాలంటే టెక్నికల్​ ఎనాలసిస్​పై పట్టు సాధించాల. స్టాక్స్​ ఛార్ట్​ను అర్థం చేసుకోవాలి. కొంత కాలం వాటిని ట్రాక్​ చేయాలి. స్టాక్​ ట్రెండ్​ని అర్థం చేసుకోవాలి.

స్వింగ్​ ట్రేడింగ్​ కోసం అనేక స్ట్రాటజీలు ఉంటాయి. 'ఇండికేటర్ల' ఆధారంగా స్వింగ్​ ట్రేడ్​ చేస్తుంటారు. ‘ఛార్ట్​ పాటర్న్​’తోనూ ట్రేడింగ్​ చేస్తుంటారు. ఈ రెండింటినీ కలిపి కూడా ట్రేడ్​ చేస్తుంటారు.

అయితే ప్రతి స్ట్రాటజీ ప్రతి ఒక్కరికీ సూట్​ అవ్వదు! మన మైండ్​సెట్​కి కొన్ని మాత్రమే పనిచేస్తాయి. వాటి మీద పట్టు సాధించాలి.

స్వింగ్​ ట్రేడింగ్​లో నష్టాలు వస్తాయా?

స్టాక్​ మార్కెట్​ అంటేనే రిస్కీ. స్వింగ్​ ట్రేడింగ్​లో కూడా రిస్క్​ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. కానీ స్వింగ్​ ట్రేడింగ్​ చేయాలి అని అనుకునే వారు ఒక విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తీసుకునే అన్ని ట్రేడ్స్ లాభాల్లోనే ఉండాల్సిన పని లేదు! 10 ట్రేడ్స్​లో.. 1:2 రేషియోలో.. 6-7 సక్సెస్​ అయినా మీరు లాభాల్లోనే ఉంటారు.

పైగా స్వింగ్​ ట్రేడింగ్​లో ఒక పెద్ద రిస్క్​ ఉంది. ఇంట్రాడేలో అదే రోజు ట్రేడ్​ను క్లోజ్​ చేస్తారు కాబట్టి.. తర్వాతి రోజు ఏం జరుగుతుందో పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ.. స్వింగ్​ ట్రేడింగ్​లో అలా కాదు! మార్కెట్​ని ఎవరూ ఊహించలేరు. రాత్రికి రాత్రికి పరిస్థితులు మారిపోతాయి. తదుపరి రోజున మార్కెట్​ నష్టాల్లో ఓపెన్​ అయితే, మీ స్టాక్​ కూడా నష్టాల్లోనే ఉండొచ్చు!

మీ 'ఎడ్జ్​'ని గుర్తించండి..

ఇప్పటి వరకు మీరు చదివినది చాలా సింపుల్​గా ఉండొచ్చు. స్వింగ్​ ట్రేడింగ్​ ఈజీ అనిపించొచ్చు. కానీ ఏదీ సులభం కాదు! చాలా కాలం ప్రాక్టీస్​ చేయాలి. నష్టాలను తట్టుకోవాలి. స్ట్రాటజీతో మనకంటూ ఒక 'ఎడ్జ్​'ని క్రియేట్​ చేసుకోవాలి. చాలా మంది ప్రముఖ ట్రేడర్లు ఈ ఫేస్​ని దాటుకుని వెళ్లిన వారే!

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​ అనేది రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)