Tirumala Vaikunta Dwara Darshan Tickets 2026 : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లు, టోకెన్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. నవంబర్ 28న శ్రీవాణి టికెట్లు, నవంబర్ 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు.
దర్శన టికెట్లు, టోకెన్ల షెడ్యూల్ ఇదే

వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు, టోకెన్లు పొందే తేదీలను అధికారులు ఖరారు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి….
- నవంబర్ 28 : ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.
- నవంబర్ 30 : ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా అందుబాటులోకి తెస్తారు.
- డిసెంబర్ 1 నుంచి 5 వరకు : వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 1 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది.
- డిసెంబర్ 7 : మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తారు.
- డిసెంబర్ 8 : ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్లు విడుదల చేస్తారు.
వీఐపీ బ్రేక్, రూ.300 దర్శనాలు రద్దు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ రెండు రోజుల్లోనూ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రద్దు చేశారు.
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ఈ రెండు రోజులకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయిస్తారు. దీనివల్ల ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం సులభంగా లభిస్తుంది.
{{/usCountry}}సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ఈ రెండు రోజులకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయిస్తారు. దీనివల్ల ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం సులభంగా లభిస్తుంది.
{{/usCountry}}భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ABOUT THE AUTHOR
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.