తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సమస్యలు రావొద్దు : టీటీడీ

బ్రహ్మోత్సవాల సందర్భంగా సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. భక్తులకు నెట్‌వర్క్ సమస్య రాకుండా చూసుకోవాలన్నారు.

Published on: Sep 8, 2026, 09:22:54 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలు తమకు అప్పగించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలో సంబంధిత అధికారులతో మ్యూజియం ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించి, ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

టీటీడీ అదనపు ఈవో సమీక్ష
టీటీడీ అదనపు ఈవో సమీక్ష

మ్యూజియంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి విభాగం తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా మ్యూజియం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై టీసీఎస్‌ బృందానికి కూడా అవసరమైన సమాచారం, సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

అనంతరం తిరుమలలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థ, సెల్‌ టవర్ల పనితీరుపై అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలతో పాటు కాలిబాటలు, ఘాట్‌ రోడ్లలో భక్తులకు మెరుగైన మొబైల్‌ నెట్‌వర్క్‌ సదుపాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా గరుడసేవ రోజున భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ఆ రోజు మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచి, ఎలాంటి అంతరాయం లేకుండా మొబైల్‌ సేవలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం తిరుమల, ఘాట్‌ రోడ్లు, కాలిబాటల్లో ఎన్ని సెల్‌ టవర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయనే అంశాలను అధికారులు, సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్లతో కలిసి సమీక్షించారు. అందుబాటులో ఉన్న అన్ని సెల్‌ టవర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా సంబంధిత సరఫరాదారులు చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో స్పష్టం చేశారు.

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి కమ్యూనికేషన్‌ సమస్యలు తలెత్తకుండా ముందుగానే అన్ని సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి, నెట్‌వర్క్‌ వ్యవస్థను పటిష్టంగా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశాల్లో ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, ఎస్ఈ శ్రీనివాసులు, ఈఈ శ్రీనివాసరావు, డీఈ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More